30.7 C
Hyderabad
April 29, 2024 03: 29 AM
Slider విజయనగరం

గిరిజనుల గ్రామాలలో ఖాకీల పర్యటన.. కరోనా పట్ల అవగాహన

#Vijayanagaram

కరోనా పట్ల గిరిజనులకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు విజయనగరం పోలీసులు. ఈ మేరకు జిల్లాలో గంట్యాడ మండలం ఏజన్సీ గ్రామాలైన దిగువ కొండపర్తి, చినబడ్డతీగ, పేద అడ్డతీగ గ్రామాలను విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ ఆయన బృందం సందర్శించారు.

తాటిపూడి డామ్ కు అవతల ఉన్న ఏజన్సీ గ్రామ ప్రజలను కరోనా పట్ల అప్రమత్తం చేసేందుకుగాను సందర్శించారు. జ్వరం తో బాధ పడుతున్న వారు ఎవరైనా ఉంటే కరోనా పరీక్షలు చేసుకోవాలన్నారు. కరోనా మందులను, పండ్లు, తిను బండారాలు ను ఏజన్సీ గిరిజనులకు డీఎస్పీ అందించారు.

వ్యాధి లక్షణాలు ఏ మాత్రం కనబడినా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాద్య బృందం ను సంప్రదించి, పరీక్షలు చేసుకోవాలన్నారు. వ్యాధి ప్రాథమిక స్థాయిలో అప్రమత్తంగా ఉంటే సులభంగా వ్యాధి ప్రభావం నుండి బయటపడే వచ్చునన్నారు.

గిరిజనులకు శానిటైజర్లు, విటమిన్ ,జింక్ టాబ్లెట్స్, మాస్క్ లను పంపిణీ చేశారు. డీఎస్పీ చొరవతో కొద్ది మంది గిరిజనులకు కరోనా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను అందజేశారు.

జిల్లా యంత్రంగం మరియు డాక్టర్ల తో మాట్లాడి గిరిజనులందరికి కరోనా వాక్సిన్ వేసే ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం రూరల్ సీఐ మంగవేణి, గంట్యాడ ఎస్ఐ గణేశ్ ,డి.కె.పర్తి,మహిళా సంరక్షణ పోలీసు  కుమారి షాబాన మరియు ఇతర సచివాలయ సిబ్బంది, దాతలు బాషాతో పాటు వైద్య బృందం పాల్గొన్నారు.

Related posts

ఉప్పల ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

రోజు రోజుకూ ఉధృతమవుతున్న రైతుల ధర్నాలు

Satyam NEWS

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఏమన్నారంటే

Satyam NEWS

Leave a Comment