33.7 C
Hyderabad
April 28, 2024 00: 13 AM
Slider విజయనగరం

రాత్రి వేళ సరిహద్దు చెక్ చేసిన విజయనగరం ఎస్పీ..!

#VijayanagaramPolice

కర్ఫ్యూ పుణ్యమా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.అందుకు ఉదాహరణే..విజయనగరం జిల్లాలో తగ్గిన కేసులు. గతవారం తో పోల్చితే దాదాపు  300 కేసులు తగ్గాయి. తాజాగా విజయనగరం జిల్లాలో నమోదైన కేసులు సంఖ్య సుమారు 800.ఈ సెకండ్ వేవ్ సమయంలో జిల్లా ఎస్పీ సహితం బంగ్లాకే పరిమితం అయ్యారు.

దాదాపు 23 రోజుల తర్వాత మళ్లీ ఎస్పీ జిల్లా ను తనిఖీ లతో చుట్టేయడం చేస్తున్నారు. తాజాగా జిల్లా లో అదీ విజయనగరం డివిజన్ పరిధిలో ఉన్న మోదవలస, కందివలస చెక్ పోస్ట్ లను అక్కడ  నిర్వహిస్తున్న సిబ్బంది విధులను ఆకస్మికంగా తనిఖీ లు చేసారు.తొలుత డెంకాడ మీదుగా పూసపాటిరేగ కందివలస చెక్ పోస్ట్ ను తనిఖీ చేసారు.

ఎస్పీ తనిఖీకి వస్తున్నారని ముందు గానే తెలుసుకున్న పూసపాటిరేగ ఎస్ఐ జయంతి సమయానికి అక్కడే ఉన్నారు. అత్యంత పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ జయంతి ని ఎస్పీ మేడం అక్కడిక్కడే ఆమె నిర్వర్తించిన విధులను తెలుసుకుని సత్కరించారు.అక్కడ నుంచీ మోదవలస చెక్ పోస్ట్ ను తనిఖీ చేసారు.

కొద్ది రోజుల క్రితమే అక్కడే మధ్యాహ్నం పూట సీఐ విజయానంద్ పకడ్బందీగా విధులు నిర్వర్తించి…పాస్ లు ఉన్న వారినే జిల్లాలో కి అనుమతిస్తున్నారని సత్యం న్యూస్. నెట్ లో ప్రచురించిన విషయం తెలుసుకున్న ఎస్పీ…అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ని అభినందించారు.

అనంతరం కర్ఫ్యూ సమయంలో సిబ్బంది అనుసరించాల్సిన ,పాటించాల్సిన విషయాలను మరో సారి సిబ్బంది కి తెలియజేసారు.అక్కడ నుంచీ వై జంక్షన్ వద్ద చెక్ పోస్ట్ ను ఎస్పీ పరిశీలించారు. అప్పుడే ఎస్పీ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న డీఎస్పీ అనిల్ సీఐ మంగవేణిలు వై జంక్షన్ వద్దకు చేరుకోవడం..ఎస్పీతో ఇచ్చిన ఆదేశించిన ఆదేశాలను  పాటించ సాగారు.

ఏదైనా మరి మారు ఎస్పీ రాజకుమారీ జిల్లా సరిహద్దుల్లో అదీ విజయనగరం డివిజన్ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు.

Related posts

చిన్నారిని ఆదుకున్న మంత్రి ఆర్కే రోజా

Bhavani

వెనుకబడిన వర్గాల నేతలపై కత్తికట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్

Satyam NEWS

అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోవడం ఒక రోగం

Satyam NEWS

Leave a Comment