38.2 C
Hyderabad
April 29, 2024 22: 21 PM
Slider విజయనగరం

రామ‌తీర్ధంలో శైవ క్షేత్రాన్ని సంద‌ర్శించిన విజయనగరం పోలీస్ బాస్

#vijayanagarampolice

ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌సిద్ది గాంచిన రామ‌తీర్ధంలోని శైవక్షేత్రంలో  మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినంవేళ శివ‌య్య‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పొటెత్తారు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్బంగా రామ‌తీర్ధం పుణ్య‌క్షేత్రాన్ని పోలీస్ బాస్ దీపిక  సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్బంగా రామ‌తీర్దంలోని కోదండ‌ రామాల‌యం..ఆ ప‌క్క‌నే  ఉన్న శివాల‌యంలోని  ఎస్పీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప్ర‌దానంగా మ‌హాశివ‌రాత్రి సంద‌ర్బంగా పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే  భ‌క్తుల‌కు  ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గకుండా శాఖ నిర్వ‌హిస్తున్న బందోబ‌స్తును ఎస్పీ ఈసంద‌ర్బంగా ప‌రిశీలించారు. ముందుగా దిగువ ఉన్న రాములోరి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ఆల‌య అర్చ‌కులు కిర‌ణాచార్యులు ఎస్పీకి ఏఎస్పీకి పూర్ణ కుంభంతో స్వాగతం ప‌లికారు. అక్క‌డే తీర్ధ ప్రసాదాలు స్వీక‌రించిన ఎస్పీకి ఆల‌య అర్చ‌కులు మండ‌పంలోని  ఆల‌య మ‌ర్యాద‌ల‌తోశాలువ క‌ప్పి స‌త్క‌రించారు. అక్క‌డ నుంచీ ఆ  ప‌క్క‌నే ఉన్న శివాలయాన్ని ద‌ర్శ‌నం చేసుకున్నారు.

అనంత‌రం ఆ ప‌క్క‌నే ఉన్న కోనేరు వ‌ద్ద భ‌క్తుల ర‌ద్దీని ప‌రిశీలించి అక్క‌డే విదులు నిర్వ‌హిస్తున్న సిబ్బందికి జాగ్ర‌త్త‌లు చెప్పాల‌ని సూచించారు. ఇక‌ముంందు రోజే అడిష‌నల్ ఎస్పీ విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ రామ‌తీర్ధంలో మ‌హాశివ‌రాత్రి సంద‌ర్బంగా నిర్వ‌హించాల్సిన బందోబ‌స్తుపై రాత్రి ప‌ద‌కొండు వ‌ర‌కు స‌మావేశాలు నిర్వ‌హించారు.

బందోబ‌స్తు ఇంచార్జ్ గా ఎస్సీ,ఎస్టీ  డీఎస్పీ వ్య‌వ‌హ‌రించ‌గా నెల్లిమ‌ర్ల‌, విజ‌య‌న‌గ‌రం రూర‌ల్,గంట్యాడ‌, విజ‌య‌న‌గ‌రం ట్రాఫిక్,వన్ టౌన్, టూటౌన్, డెంకాడ‌, పూస‌పాటిరేగ‌, సెంట్ర‌ల్ క్రైమ్ స్టేష‌న్  సిబ్బంది రామ‌తీర్ధం బందోబ‌స్తుకై విధులు నిర్వ‌హిస్తున్నారు.

రామతీర్ధం ప్ర‌ధాన ఆల‌యం వ‌ద్ద రూర‌ల్ సీఐ మంగ‌వేణి, ఇత‌ర సీఐలు  న‌రసింహ‌మూర్తి,కాంతారావు,శ్రీనివాస‌రావు, ఎస్ఐలు నారాయ‌ణ‌,భాస్క‌ర‌రావులు బందోబ‌స్తులో ఉండ‌గా నెల్ల‌మ‌ర్ల‌లోని రామ‌తీర్ధం జంక్ష‌న్ వ‌ద్ద గంట్యాడ ఎస్ఐ కిర‌ణ్, క‌మాండ్ కంట్రోల్ రూమ్ ఏఎస్ఐ యాకుబ్,అలాగే బందోబ‌స్తుకు రూట్ మ్యాప్ కు ఇంచార్జ్ గాసాగ‌ర్ బాబు అలాగే వ‌న్ టౌన్ ఎస్ఐ అశోక్ కుమార్, ఇక శివాల‌యంవ‌ద్ద క‌మాండ్ కంట్రోల్ రూమ్ ఏఎస్ఐ ల‌క్ష్మి విధులు నిర్వ‌హించారు.

జిల్లా ఎస్పీ వెంట విజయనగరం సబ్ డివిజన్ ఇన్ ఛార్జ్ అదనపు ఎస్పీ  అనిల్ పులిపాటి, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ  ఆర్.శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Related posts

జగన్ కోర్టు ధిక్కారం పిల్ పై 16న సుప్రీం విచారణ

Satyam NEWS

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195

Sub Editor

ఫిర్యాదు దారుల  అలసటను గుర్తించిన పోలీసు బాస్…!

Satyam NEWS

Leave a Comment