27.7 C
Hyderabad
April 26, 2024 05: 47 AM
Slider విజయనగరం

న‌గ‌ర రోడ్ల‌పై విజయనగరం ఎస్పీ ఆక‌స్మిక త‌నిఖీలు

#VijayanagaramSP

క‌రోనా సెకండ్ వేవ్ లో  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌డ‌చిన వారం రోజుల బ‌ట్టి క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

పొరుగు జిల్లాలైన విశాఖ‌, శ్రీకాకుళం జిల్లాలతో పోలిస్తే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మాత్రం త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని రాష్ట్ర  వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌తీ రోజూ వెల్ల‌డిస్తున్న నివేదిక  స్ప‌ష్టం చేస్తోంది.

అయితే వారం రోజుల క్రితం వ‌ర‌కూ జిల్లా స్థాయ అధికారులుల‌లో కొంద‌రికి క‌రోనా రావ‌డంతో విశ్రాంతి తీసుకుని తిరిగి కోలుకున్నాక ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మ‌ళ్లీ  క‌ద‌న రంగంలోకి దూకారు.

జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో ఆక‌స్మికంగా ప‌ర్య‌టించారు.జిల్లాలో ప్రతీ రోజూ కర్ఫ్యూ ఉదయం 6 నుండి 12 గంటల వరకు  క‌ర్ఫ్యూ సడలింపు సమయంలో ప్రతీ ఒక్కరూ 144 సీఆర్పీసీ నిబంధనలు, క‌రోనా  నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని త‌న శాఖా సిబ్బందిని ఎస్పీ రాజ‌కుమారీ ఆదేశించారు.

కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించేందుకుగాను ఎస్పీ  జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రంలోని ఆర్టీసి కాంప్లెక్సు, బాలాజీ , కోట జంక్షన్, పీడ‌బ్య్లూ మార్కెట్, గంట స్థంభం, కేపి టెంపుల్, సీఎంఆర్, గూడ్సు షెడ్ ప్రాంతాలను ఆక‌స్మికంగా ప‌ర్య‌టించి త‌నిఖీ చేసారు.

మద్యాహ్నం 12 గంటల తరువాత షాపులు మూసి వేసే విధంగా చర్య చేపట్టారు. కర్ఫ్యూ నిబంధనలు ప్రకారం మద్యాహ్నం 12 గంటల తరువాత వ్యాపారాలకు అనుమతులు లేనందున సందుల్లో ఉన్న షాపులు కూడా మూసి వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా ప్రజలు గుమిగూడి ఉండడం, గుంపులుగా సంచరించడం చేస్తున్నారన్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సీఆర్పీపీ నిబంధనలు అమలులో ఉన్నాయని, ఎవ్వరూ కూడా గుంపులుగా సంచరించకూడదన్నారు.

మార్కెట్ పనుల నిమిత్తం రైతు బజార్లు, మార్కట్ ప్రాంతాలు, చేపల మార్కెట్లు, కూరగాయల మార్కెట్ల వద్ద ప్రజలు మూకుమ్మడిగా సంచరిస్తున్నారన్నారు. ఈ నేప‌ధ్యంలో 144 సీఆర్పీసీ నిబంధనలు కఠినంగా అమలయ్యే విధంగా వ్యవహరించాలని జంక్ష‌న్ ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశించారు.. 

న‌గ‌రంలోని సింహాచలం మేడ వద్ద మాస్క్ స‌రిగ్గా ధరించకుండా వెళ్ళుతున్న కొంత‌ మందిని జిల్లా ఎస్పీ వారిని  చూసి..సిబ్బంది చేత ఆపి  ప్రశ్నించి, కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతీ ఒక్కరూ డబుల్ మాస్క్  వినియోగించాలని, నోరు, ముక్కు పూర్తిగా మూసివేసే విధంగా మాస్క్ ధరించాలని అవగాహన కల్పించారు. 

నిబంధ నలు అతిక్రమించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం, ఎపిడిమిక్ డిసీజెస్ చట్టం కింద కేసులను నమోదు చేయాలన్నారు. ఎస్పీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌నలో విజయనగరం 1వ పట్టణ సీఐ జె.మురళి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Related posts

దాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

Bhavani

కొల్లాపూర్ సర్కిల్ పరిధిలో అక్రమ సారాపై దాడులు

Satyam NEWS

ఫైండింగ్ నిర్మల:ఆర్థికశాఖ మంత్రి లేకుండానే బడ్జెట్‌ సమావేశమా ?

Satyam NEWS

Leave a Comment