33.7 C
Hyderabad
April 28, 2024 00: 00 AM
Slider విజయనగరం

ఆర్టీసి ఎం.డి.ని మర్యాద పూర్వకంగా కలిసిన విజయనగరం జిల్లా ఎస్పీ

#RTC MD

ఇటీవల ఆర్టీసి మేనేజింగు డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన అదనపు డీజీ సిహెచ్. ద్వారకా తిరుమలరావును విజయనగరం జిల్లా ఎస్పీ  రాజకుమారి పోలీసు అతిధి గృహం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్టీసి ఎండిగా సిహెచ్. ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తరువాత పట్టణం నగరంలోని ఆర్టీసి ప్రాంతీయ కార్యాలయం, ఆర్టీసి కాంప్లెక్స్ ప్రాంతాలను పరిశీలించేందుకు జిల్లా కేంద్రంకు రాగా, కాసేపు పోలీసు అధికారులతో అతిధి గృహం వద్ద గడిపారు.

అదనపు డీజీ గౌరవార్ధం జిల్లా అధికారులు పోలీసు అతిధి గృహం వద్ద గార్డును ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులను గురించి అదనపు డీజీ తిరుమలరావు జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో పని చేస్తున్న అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, ఒఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఇతర అధికారులను అదనపు డీజీ ద్వారకా తిరుమల రావుకు జిల్లా ఎస్పీ రాజకుమారి పరిచయం చేయగా, వారు అదనపు డీజీకి శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులు గతంలో ఎక్కడ పని చేసినది, ఏ బ్యాచ్ కు చెందినవారో అదనపు డీజీ అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, ఒఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు, విజయనగరం డీఎస్పీ పి.అనిల్ కుమార్, ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు పి.నాగేశ్వరరావు, చిరంజీవి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ధర పెరిగితే ఏం? నేను ఉల్లి తిననుగా

Satyam NEWS

ఛత్రపతి శివాజీ సాక్షిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణం

Satyam NEWS

పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి

Satyam NEWS

Leave a Comment