Slider సినిమా

రష్మిక కంటే విజయశాంతికే ఎక్కువ పారితోషికం

vijaya-shanthi-rasmika-mandana

మహేశ్ బాబు అభిమానులంతా ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జనవరి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించనుండగా, కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకిగాను రష్మికకి ఎంత పారితోషికం ఇచ్చి వుంటారు .. విజయశాంతికి ఎంత ఇచ్చి వుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

రష్మికకి కోటి రూపాయలు ఇవ్వగా, విజయశాంతికి కోటిన్నర ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. విజయశాంతి రెండున్నర కోట్ల వరకూ అడిగిందట. అయితే రిక్వెస్ట్ చేయడంతో ఆమె కోటిన్నరకి ఓకే చెప్పారట. పెద్ద బ్యానర్ .. స్టార్ హీరో .. కీలకమైన పాత్ర .. తన రీ ఎంట్రీ ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజయశాంతి తన పారితోషికాన్ని తగ్గించుకున్నారని అంటున్నారు. ఎంత తగ్గించుకున్నా హీరోయిన్ కన్నా ఎక్కువ పుచ్చుకోవడమే ఇక్కడ విశేషం.

Related posts

ప్రాణాలు తీసిన రక్షా బంధన్

Satyam NEWS

మగ పిల్లలతో పాటు ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వటమే న్యాయం

Satyam NEWS

ప్రపంచ మేధావి అంబేద్కర్ కు కేసీఆర్ ఘన నివాళి

mamatha

Leave a Comment

error: Content is protected !!