28.7 C
Hyderabad
April 27, 2024 06: 23 AM
Slider తెలంగాణ

జ్వరాలతో వణుకుతున్న హైదరాబాద్

293724-swine-flu

వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. డెంగ్యూ కేసులను నిర్ధారించడంపై నిషేధం విధించడంతో కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నది తప్ప వాస్తవానికి తగ్గడం లేదు. వైరల్ ఫీవర్, బ్రెయిన్ ఫీవర్ కేసులైతే ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ ఫీవర్, బ్రెయిన్ ఫీవర్, డెంగ్యూ వ్యాధులు తీవ్రంగా విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో హెల్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలు కలిసి పని చేయాల్సిన ఈ పరిస్థితిలో ఈ శాఖల మధ్య సమన్వయం కనిపించడం లేదు. అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సెప్టెంబర్ మాసంలో ఈ విధమైన వానలు కురిసే అవకాశం లేదు. అయితే అసాధారణమైన ఈ పరిస్థితుల్లో వానాకాలం వ్యాధులు తగ్గుముఖం పట్టడం లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. అదే విధంగా జిల్లాలలో కూడా వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందుతూనే ఉంది. సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గతంలో రోజుకు 100 నుంచి 120 డెంగ్యూ కేసులు నమోదయ్యేవని వాటి సంఖ్య ఇప్పుడు రోజుకు 40 కి తగ్గిందని జీహెచ్ఎంసి కమిషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ చెబుతున్నారు. ఎక్కడ తగ్గాయో తెలియడం లేదు

Related posts

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అరెస్టు వారంట్

Satyam NEWS

గ్రీన్ లైట్: కీసర టోల్ ప్లాజా వద్ద పటిష్టమైన చర్యలు

Satyam NEWS

అలిగేషన్‌:వారికి కేజ్రీవాల్ బిర్యానీలు పంచుతున్నారు

Satyam NEWS

Leave a Comment