33.7 C
Hyderabad
April 29, 2024 00: 05 AM
Slider ప్రత్యేకం

రాష్ట్రంలో చర్చిలు ఎన్ని? అందులో పాస్టర్లు ఎందరు?

#volenteers in ap

ఏపీలో వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు….. నిజం… వారికి ఇచ్చే జీతం ఎంతో గానీ అడ్డమైన పనులూ చేయిస్తున్నారు. తాజాగా ఏపీలోని వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ కలకలం రేపుతోంది.

అదేదో ప్రజలకు ఉపయోగపడేది కాదు….. అదేమిటంటే రాష్ట్రంలోని  చర్చిలకు సంబంధించిన మెసేజి అది. రాష్ట్రంలోని అన్ని  గ్రామాల్లోని చర్చిల వివరాలు, వాటితో బాటు పాస్టర్ల పేర్లు సేకరించాలని సచివాలయ సిబ్బంది నుంచి వాలంటీర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

చర్చిలకు అనుబంధంగా ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఇవ్వాలని వాట్సప్ మెసేజుల ద్వారా తెలియజేశారు. మత పరమైన కార్యక్రమాలు మాతో చేయించడం ఏమిటి అని ప్రశ్నించడానికి కూడా వాలంటీర్లు భయపడుతున్నారు.

ఈ పని మేం చేయం అని ఎవరైనా అంటే మందీ మార్బలంతో అధికార పార్టీ వత్తిడి తెచ్చే అవకాశం ఉందని కూడా వారు ఎంతో భయపడుతున్నారు.

ఇప్పటికే చాలా కార్యక్రమాలతో తమకు పని భారం పెరిగిందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కొత్తగా చర్చిల వివరాలు ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చర్చిల బలోపేతానికి ప్రభుత్వమే కృషి చేస్తుందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

చర్చి సేవలకు ప్రభుత్వం నెలకు రూ.5వేలు ఇవ్వాలి

Satyam NEWS

వరద ప్రాంతాల రైతుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

Satyam NEWS

మూత్ర పిండ క్యాన్సర్ కు మమత లో అరుదైన చికిత్స

Satyam NEWS

Leave a Comment