40.2 C
Hyderabad
April 28, 2024 17: 53 PM
Slider ముఖ్యంశాలు

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి

#roshapati

మూడవ ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి రష్యా,ఉక్రెయిన్ దేశాల మధ్య ఉందని,తక్షణమే ఐక్యరాజ్యసమితి చొరవ చూపించి యుద్ధం ఆపాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో రోషపతి మాట్లాడుతూ ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారిని భారతదేశం తక్షణమే కాపాడాలని, ప్రధానమంత్రి తక్షణమే ఈ విషయమై చొరవ తీసుకోవాలని కోరారు.

ప్రపంచములో అంతర్ యుద్ధాలు జరగకుండా ఉండటానికి ఐక్యరాజ్య సమితి ఏర్పడిందని,గతంలో అమెరికా ఆధిపత్యం కోసం అవకాశవాదల వల్ల రాజ్య సమితి పవర్ లేకుండా చేసిందని, దాని ప్రభావం ఇప్పుడు కొట్టొచ్చినట్టుగా కనపడుతోందని అన్నారు.యుద్ద ప్రభావం ప్రపంచ దేశాల మీద,ప్రజల మీద పడుతుందని,అమెరికా,రష్యా ఆధిపత్యం పోరు వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారని,గతంలో అమెరికా ఆగడాల వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు పోయాయని,నేటికీ కొన్ని దేశాలు ఆర్థికంగా కోలుకోలేక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.ఏదైనా సమస్యలని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ యుద్ధాల వల్ల పరిష్కారం కాలేదని, ప్రపంచ చరిత్ర చెబుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకన్న,రాజు, వేణు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రొటెస్ట్:ఆన్ లైన్ లోనే అమ్ముకోండి మేమెందుకు?

Satyam NEWS

ఎక్సిగ్రేసీయా, ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన పోలీసు కమిషనర్

Satyam NEWS

మాదిగలు రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడాలి

Satyam NEWS

Leave a Comment