39.2 C
Hyderabad
April 28, 2024 13: 28 PM
Slider హైదరాబాద్

బ్యూటిఫికేషన్: ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం

mla gandhi

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని  అంబిర్ చెరువు సుందరీకరణ పనులలో భాగంగా జరుగుతున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జానకి రామరాజు తో కలిసి ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరేకపూడి గాంధీ నేడు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువులు కలుషితం కాకుండా, కబ్జాలకు గురికాకుండా చేస్తామని అన్నారు. 

చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని, చెరువు చుట్టూ ఫెన్సింగ్  ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని, అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు.

పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తేవడమే తమ‌ ప్రయత్నమన్నారు. చెరువుల కబ్జాకు పాల్పడే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి అధికారులు DE కృష్ణ AE రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్,  హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు నార్నే శ్రీనివాస రావు, మాదాపూర్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కోనేరు ప్రసాద్, నర్సింహా రావు, దామోదర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, ,సుబ్బారావు, శ్రీనివాస్ రాజు, మురళి,సుబ్బారాయుడు,DS రాజు, బాబు, చలపతి, కృష్ణ వేణి, విమల, స్వప్న  తదితరులు పాల్గొన్నారు.

Related posts

యూపీఏ లేదన్న మమతాకు కాంగ్రెస్ గట్టి కౌంటర్

Sub Editor

ఘనంగా కౌండిన్య IAS అకాడమీ 17 వ వార్షికోత్సవం

Bhavani

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళామణులకు సన్మానం

Satyam NEWS

Leave a Comment