29.7 C
Hyderabad
April 29, 2024 07: 43 AM
Slider సినిమా

మెగా సినిమాలు ఒకేరోజు రీ రిలీజ్ చేయకూడదనుకున్నాం

#Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ “గ్యాంగ్ లీడర్” సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలిపారు. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నామని, అయితే అదే రోజు మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను రీ రిలీజ్ చేస్తుండటంతో, మెగా కుటుంబ హీరోల సినిమాలను ఒకేసారి పోటీగా విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు నట్టికుమార్ స్పష్టం చేశారు.

ఆ మేరకు సంక్రాంతి సినిమాల తర్వాత జనవరి నెలాఖరులో “గ్యాంగ్ లీడర్” రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు, అందుకు సంబందించిన తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామని ఆయన వివరించారు. చాలా ఏళ్ల క్రితం వచ్చిన “గ్యాంగ్ లీడర్” సినిమా అప్పట్లో అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని, అందులో చిరంజీవి, విజయశాంతి నటనతో పాటు చక్కటి కథ, కథనాలు, కామెడీ, యాక్షన్ వంటి అన్ని అంశాలు ఆద్యంతం అలరింపజేశాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇక పాటల సంగతికి వస్తే “పాప రీటా….”,, “పాలబుగ్గ…”, “భద్రాచలం కొండ… “, “వానా.. వానా…”, “వయసు వయసు…”, “పనిసా ససా…” వంటి పాటలు, వాటికి చిరంజీవి చేసిన డాన్స్ నేటికీ వీనులవిందు చేస్తున్నాయని ఆయన తెలిపారు

Related posts

డబ్బు గుంజుతున్న రిపోర్టర్ల అరెస్టు

Satyam NEWS

హోంగార్డు కుటుంబానికి ఆర్ధిక సహాయం అంద‌జేత

Satyam NEWS

పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment