28.7 C
Hyderabad
April 26, 2024 07: 00 AM
Slider హైదరాబాద్

మన ఘన చరిత్ర రాబోయే తరాలకు అందించాలి

kamalakara

రాబోవు తరానికి ఘనమైన మన చరిత్ర , సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుపవలసిన అవసరం ఉందని ప్రముఖ జ్యోతిశాస్త్రవేత్త , ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులు డా. సాగి కమలాకర్ శర్మ అన్నారు.  కాచిగూడ నింబోలిఅడ్డాలోని సరస్వతీ శిశు మందిరం పాఠశాలలో   జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగి వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసింగించారు. స్వాతంత్ర పోరాటంలో  అనేకులు ప్రాణార్పణ చేశారు. పేరు కోసం కాకుండా దేశం కోసం  త్యాగాలు చేసారు. అటువంటి పుణ్యమూర్తుల త్యాగఫలాలు మనం అనుభవిస్తున్నామని  అయన  అన్నారు. పోరాట యోధుల త్యాగాలను స్మరిస్తూ దేశ స్వాతంత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.     జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటనగా కమలాకర్ శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా  ”  జలియన్ వాలా బాగ్ ” పుస్తకం ఆవిష్కరించారు. అట్లాగే  సిక్కుల గురువు గురునానక్ జన్మించి 550 సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా ప్రచురించిన మరో పుస్తకం ” నానక్ దేవ్ ” ను పాఠశాల కమిటీ అధ్యక్షులు యం హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో   ఆరెస్సెస్  ప్రతినిధులు కేశవనాథ్, నర్సింహా, పరశురామ్ తో పటు  పాఠశాల కార్యదర్శులు బి. శంకరరావు , డి ఆర్ ఎస్ నరేంద్ర, ఉపాధ్యక్షులు రమేష్ మంజునాథ, ప్రధానోపాధ్యాయులు వాణి , సుశీల ,పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఇక లేరు

Satyam NEWS

మన సినిమా వాళ్ళు ఇప్పటికైనా మారాలి

Satyam NEWS

బతుకమ్మ సంబురాలు: చీర అదిరె ఆడపడుచు మురిసే

Satyam NEWS

Leave a Comment