26.2 C
Hyderabad
December 11, 2024 17: 59 PM
Slider సంపాదకీయం

ఈ సారి తెలంగాణలో ఏం జరుగుతుందో…?

#KCR

కులాల మధ్య ప్రాంతాల మధ్య తగాదాలు రేపే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం సొంత రాష్ట్రమైన బీహార్ లో రాజకీయ పార్టీ స్థాపించి బిజీగా ఉన్నారని అందరూ అనుకున్నారు. బీహార్ లో ఆయన సొంత పార్టీకి ఏ మాత్రం ఆదరణ లభించడం లేదు. ఇతర పార్టీలకు అధికారంలోకి వచ్చేంత వరకూ వూహ్యాలు అందించే ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నారనేది చర్చనీయాంశం అయింది కూడా.

ఆంధ్రప్రదేశ్ లో అయితే కులాల మధ్య కుంపట్లు పెట్టి జగన్ అధికారంలోకి వచ్చేలా చేశాడు ప్రశాంత్ కిషోర్. ఆయన అందించిన వ్యూహమే ఇప్పటి వరకూ జగన్ కూడా అమలు చేస్తున్నారు. అందుకోసమే అనునిత్యం కులాల పేరును ప్రస్తావిస్తూ, సామాజిక మాధ్యమాల్లో కులాల మధ్య వైషమ్యాలు తగ్గకుండా చూసుకుంటుంటారు. ప్రశాంత్ కిషోర్ ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించేవారు. అయితే ఇటీవల ఆయన అడిగిన మేరకు నిధులు సమకూర్చలేదనే కారణంతో ఆయన ఏపి నుంచి దూరం అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.

అందుకు అనుగుణంగానే ప్రశాంత్ కిషోర్ కూడా ఈ మధ్య కాలంలో ఏపీకి రాలేదు. దాంతో ప్రశాంత్ కిషోర్ పీడ విరగడ అయిందని అందరూ అనుకున్నారు. అయితే ఆయన పీడ విరగడ కాలేదని తాజాగా జరిగిన ఒక పరిణామం స్పష్టం చేస్తున్నది. ఈ సారి ఆయన తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు.

తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీన్నించి గట్టుక్కడానికి  ప్రశాంత్ కిషోర్ ను రంగంలో దించుతున్నట్లు పుకార్లు చెలరేగుతున్నాయి. గత ఆదివారం ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్ కు వచ్చారని.. కేసీఆర్,కేటీఆర్ మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారని రాజకీయవర్గాల్లో ఒక్క సారిగా గుప్పు మంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని విశ్లేషించుకున్నారని.. ఇంటలిజెన్స్ రిపోర్టులు, ఇతర సర్వేలను బట్టి చూస్తే… మౌత్ టాక్ కాంగ్రెస్ వైపు ఉందని.. దాన్ని ఎలా మార్చాలన్న అంశంపై చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు.

ఇటీవల కేసీఆర్ తమ మేనిఫెస్టో గురించి కూడా సభల్లో చెప్పడం లేదు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏదో జరిగిపోతుందని ఓటర్లను భయపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దామనుకునేవారి ఆలోచనల్లో మార్పు తెస్తే.. ఫలితం మారదని.. గత ఎన్నికలలోలానే ఉంటుందని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే అప్పటి నుండి రాజకీయం మారిపోయిందని… కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకునేవారి ఆలోచనలో మార్పు తెచ్చేందుకు… ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు వైపు వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

అయితే ప్రశాంత్ కిషోర్ తో ఎలాంటి ఒప్పందం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పీకేతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ తర్వాత వద్దనుకున్నారు. పీకేని భరించలేక .. ప్రభుత్వాన్ని కూడా ఎలా నడపాలో చెబుతున్నందున వద్దనుకున్నామని కేటీఆర్ చెప్పారు. అయితే.. క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఎంతో అవసరం అని ఆయనను ప్రగతి భవన్ పిలిపించి మాట్లాడారని చెబుతున్నారు. ఆయన ఏ సలహాలు ఇచ్చారో… వచ్చే వారం రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది.

Related posts

చేసిన పనికి మాకు గుర్తింపు ఇవ్వండి

Satyam NEWS

కొత్తపల్లి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన దహేగం

Satyam NEWS

డాక్టర్ కె.రమేష్ రెడ్డి కి వి ఎస్ యూ అశ్రునివాళి 

Satyam NEWS

Leave a Comment