32.7 C
Hyderabad
April 27, 2024 01: 48 AM
Slider రంగారెడ్డి

చెరువులు ఎక్కడ ఉన్నాయో చెబుతారా?

#HyderabadFloods

హైదరాబాద్ నగర శివార్ల లోని అప్ప చెరువు ఆ ప్రాంత వాసులను నానా ఇక్కట్ల పాలు చేసింది. రాజేంద్ర నగర్ పరిధిలో సుమారు వంద  కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ మధ్య తరహా చెరువు మొన్నటి వరదలకు పొంగి పొర్లి  నగరవాసులను నానా తిప్పలు పెట్టింది.

ఒకప్పుడు దీనిని కప్పల  చెరువుగా కూడా పిలుచుకునే వారు. మొన్నటి వరద బీభత్సానికి చుట్టుపక్కల కాలనీల లో పార్కింగ్ చేసి ఉన్న వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. వీటిని తిరిగి ఇళ్లకు తెచ్చుకోడానికి యజమానులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది.

మరో కీలక ప్రాంతంలో ఉన్న మీర్ పేట చెరువు కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గండి పడే ప్రమాదం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి ఇళ్లను ఖాళీ చేయించారు.

ఒకప్పుడు నగరంలో ఉన్నాయని చెబుతున్న చెరువులన్నీ ఇప్పుడేమయ్యాయి ..ఎక్కడెక్కడ ఉండేవో వాటి ఆనవాళ్ళు కనిపెట్టేందుకు పురాతన నగర మ్యాప్ లను ముందేసుకుని కూర్చుని వెతుక్కుంటున్నారట నగర కార్పొరేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు.

Related posts

దయచేసి ఇక సోనూ సూద్ ను వదిలేయండి

Satyam NEWS

All is Well: కరోనా పోయింది… ఆర్ధికం మెరుగైంది

Satyam NEWS

ఐపీసీ మానేసి వైఎస్ఆర్పీపీ సెక్ష‌న్లు అమ‌లు చేస్తున్నారు…!

Satyam NEWS

Leave a Comment