41.2 C
Hyderabad
May 4, 2024 15: 27 PM
Slider ముఖ్యంశాలు

27 రకాల దళిత సంక్షేమ పథకాలను ఎందుకు ఎత్తివేసారో చెప్పగలరా?

#potulabalakotaiah

మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాలపై చర్చించగలరా? అని అమరావతి బహుజన జెఎసి ప్రశ్నించింది.

శుక్రవారం జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 22 మంది ఎంపీలను ఇస్తే, కేంద్ర ప్రభుత్వ కాలర్ పట్టి హోదాను గుంజుకొస్తానని, రాజధాని అమరావతిని చంద్రబాబు కంటే మిన్నగా నిర్మాణం చేస్తానని, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నానని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను గుర్తు చేశారు.

పోలవరంలో అవినీతిని వెతికి తీసి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు. ఈ మూడు ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రి హోదాలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలపై కనీ వినీ ఎరుగని రీతిలో దాడులు జరిగాయని, మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ చనిపోయేలా చేశారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి వైకాపా ఎమ్మెల్సీ ఇంటికి డెలివరీ చేశారని పేర్కొన్నారు.

దళిత కులాలపై 641 దాడులు జరిగాయని, 800 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని, వీటన్నింటిపై సమీక్షించే దమ్ముందా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా కింది కులాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన 27 రకాల సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపేశారో  చెప్పాలన్నారు. దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు రాష్ట్రాన్ని దివాలాదీసి, అప్పులు దిబ్బగా మార్చి ఏం తీర్మానాలు చేస్తారని పేర్కొన్నారు.

ఆఖరికి రైతు పెన్నిధిగా పేరొందిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మను ప్లీనరీ నుంచి బయటకు పంపి, ఆయన సతీమణి విజయమ్మను గౌరవాధ్యక్ష పదవి నుంచి  దింపి వైఎస్ఆర్సిపి ప్లీనరీలో ప్రజలకు ఏం సందేశం ఇస్తారని అన్నారు.  వైసిపి కార్యకర్తలు, నాయకులు కూడా వైకాపా ఏకపక్ష పరిపాలనపై తిరగబడాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు.

Related posts

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా శక్తివంతమైనది

Satyam NEWS

భారత సైనికులకు నిర్మల్ లో ఘన నివాళి

Satyam NEWS

6జి టెక్నాలజీ కోసం సన్నాహాలు ప్రారంభించిన భారత్

Sub Editor

Leave a Comment