42.2 C
Hyderabad
April 26, 2024 15: 29 PM
Slider ముఖ్యంశాలు

క్రమశిక్షణ పట్టుదల తోనే ఉన్నత శిఖరాలకు…

#wanaparthy

క్రమశిక్షణ పట్టుదలతోనే విద్యార్థులు ఆశించిన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని వనపర్తి 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి బి. శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఖిల్లా గణపురం మండలం దొంతికుంట తండాలోని ఆదర్శ విద్యాలయంలో లోక్ అదాలత్ సంస్థ ఆధ్వర్యంలో  జరిగిన జాతీయ న్యాయ సేవా దినం సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు వివేక నందుని వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలన్నారు. సమాజంలో సన్మార్గాన్ని అనుసరించి ఆశించిన లక్ష్యం కృషి చేయాలని సూచించారు బాలికల పై జరిగే రూపొందించిన పోక్సో చట్టం వల్ల నిందితుల కు కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఒకరికి చెప్పే ముందు తాము ఆచరించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. ప్రేమ పేరిట ఆకర్షణకు గురై మోసపోవద్దు అన్నారు ఈ సందర్భంగా జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గాదం ఉత్తరయ్య, డి కృష్ణయ్య,  మండ్ల ఆంజనేయులు, జయలక్ష్మి, వినోద్, ఎస్సై వెంకటేశ్వర్లు గౌడ్, ఆదర్శ (కళాశాల) పాఠశాల ప్రధానాచార్యులు వాణి, ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు, లోక్ అదాలత్ సిబ్బంది నాగరత్నమ్మ, దేవకుమార్ రెడ్డి  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

ప్రజలను వంచించిన ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ది చెప్తారు

Satyam NEWS

‘సాక్షి’ పై కేసు: కోర్టు ఆదేశాలతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు

Satyam NEWS

పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి?

Bhavani

Leave a Comment