27 C
Hyderabad
September 22, 2020 12: 37 PM
Slider కవి ప్రపంచం

భారత యోధుడు

#Nellutla Sunitha

దామోదర్ దాస్ ముల్ చాంద్ హీరాబెన్ ల తనూజుడు

అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి నిదర్శనుడు

ఎన్నికల్లో విజయభేరి మోగించి

ఎన్డీఏ విజయపథంలో నడిపించిన సారధుడు

ప్రధానమంత్రి పీఠం వరించి అధిష్టించిన చక్రవర్తి

బాలుడిగా రైల్వేస్టేషన్లో సైనిక  దాస్యము చేసినాడు

విశిష్ట లక్షణాలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే నాడు

గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఎన్నికయ్యి

సామాజిక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర అందించినాడు

ఆర్ఎస్ఎస్ లో అత్యుత్తమ శిక్షణ పొంది నాడు

ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి

పలు నిర్ణయాల పాలసీలు అమలు చేసినాడు

నోట్ల రద్దు జిఎస్టి అమలు తలాక్ రద్దు పౌరసత్వ సవరణ చట్టాలెన్నో

విమర్శలు ఎన్ని వచ్చినా సమర్థంగా అధికారం నిలబెట్టుకొని

ఉత్తమమైన పరిపాలన కార్యశీలి గా ఘన కీర్తి గాంచినాడు

కామన్ మ్యాన్ నరేంద్రమోడీ సరికొత్త భాష్యం చెప్పారు

విదేశీ పెట్టుబడులకు విశేషంగా తోడ్పడి

నీ పాలన సామర్థ్యాన్ని అమెరికా శ్లాఘించే

అవినీతి అలసత్వాన్ని తొలగించి

ఆర్థిక రథచక్రాలను గాడిలో పెట్టినాడు

అకుంఠిత దీక్ష డై అచ్యుతుడు గా వెలుగొందాడు

గంభీరమైన ఆహార్యంతో గలమెత్తి వాగ్మి గా

విద్వత్తు తో వ్యాసాలు ఎన్నో విరచించారు

సొంత ఆస్తి కూడా పెట్టుకోక మహర్షి గా నిలిచాడు

వ్యూహకర్తగా ఉద్దీప్తం చెందినాడు

అహర్నిశలు దేశభక్తి కై ఆరాటపడిన అప్రతిముడు

నిరాడంబరత నిజాయితీ నీ జీవిత రహస్యాలు

స్వచ్ఛభారత్ స్వచ్ఛ ప్రేమిక పేరు గన్నాడు

ఉప్పెన వలె ఉద్భవించే శత్రు దేశాలపై నీ చాకచక్యం

తొలిపి లిఫ్  ప్రెసిడెన్షియల్ అవార్డులెన్నో అలంకరించి నాడు

ప్రపంచ దేశాలకు ఆరోగ్య యోగా నందించిన సాత్వికుడు

భారతమాత నిశ్చల ధర్మ బిరతుడు

దేశప్రజల దృష్టిని ఎంతో ఆకర్షించి

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా క్రికెట్ భాషా కొనియాడే

భారత జనత

నీ ఘనత జయవెట్టుపలికే

అందుకో భారత యోధుడా అక్షర కుసుమాలు

నీ జయంతి సందర్భంగా నా అభిమానం మాలికలు

జయహో మోదీ జయ జయహో మోదీజి

(భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా నా అక్షర కుసుమాంజలి)

నెల్లుట్ల సునీత, ఖమ్మం, చరవాణి: 7989460657

Related posts

వేములవాడ మండలంలో కార్డన్ అండ్ సెర్చ్

Satyam NEWS

జస్టిస్: సమత రేప్ కేసులో ముగ్గురికి ఉరి

Satyam NEWS

ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు డబ్బు దోచేశారు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!