26.2 C
Hyderabad
November 3, 2024 22: 40 PM
Slider సంపాదకీయం

వై ఎస్ విజయలక్ష్మి దారి ఎటు?

#ysvijayalaxmi

చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వెళ్లగొట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు తన కుటుంబాన్ని చంద్రబాబు చీల్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తన కుటుంబాన్ని చంద్రబాబు చీల్చాడు అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా తన సోషల్ మీడియా సైన్యానికి జగన్ రెడ్డి బాధ్యత అప్పగించినట్లు చెబుతున్నారు.

వైసీపీ ఇన్ ఫ్లుయన్సర్ ఒకరు అయితే షర్మిలను శూర్పణఖ తో పోలుస్తూ వీడియో పెట్టారు. మరి షర్మిల శూర్పణఖ అయితే శూర్పణఖ అన్న రావణాసురుడు కదా? మరి జగన్ రావణాసురుడా? అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దాంతో సినీ నటిగా తనను తాను చెప్పుకునే ఆ వైసీపీ ఇన్ ఫ్లుయన్సర్ ఇక నోరు మూయాల్సి వచ్చింది.

తన కుటుంబాన్ని చీలుస్తున్నారని జగన్ రెడ్డి చెప్పడం పై కూడా ఇప్పటికే చాలా జోకులు వచ్చాయి. సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెప్పాలని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి చెల్లెలు షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలు అయిన తర్వాత జగన్ కు చెమటలు పట్టాయి. షర్మిల తన రాజకీయ గేమ్ ను ఆరంభించడంతో వైసీపీకి మరణ మృదంగం వినిపిస్తున్నది.

ఇప్పుడు జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి విషయం ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నది. ఇంత కాలం విజయలక్ష్మి తన కుమార్తె షర్మిల వద్ద హైదరాబాద్ లో కాలం గడుపుతున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె దగ్గరుండి అన్ని పనులు చూశారు. ఇప్పుడు షర్మిల ఆంధ్రాకు వెళ్లిపోయింది. దాంతో విజయలక్ష్మి ఇప్పుడు ఏం చేయాలనే మీమాంసలో పడిపోయినట్లు చెబుతున్నారు.

మీ బిడ్డ మీ బిడ్డ అంటూ జగన్ రెడ్డి బహిరంగసభల్లో చెవుల్లో సీసం పోసినట్లుగా ప్రతి మాటకు ముందు వెనుకా అరుస్తూ ఉంటారు. కానీ ఆ బిడ్డ తల్లిని వదిలించుకుని చాలా కాలం అయింది. ఆ బిడ్డకు ఇప్పుడు మరో కష్టం వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి బిడ్డకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు.

తన అవసరం షర్మిలకు ఎక్కువగా ఉంది కాబట్టి వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల ఏపీకి వచ్చేశారు. జగన్ రెడ్డి బలంపైనే గురి పెట్టారు. ఇప్పుడు కూడా విజయమ్మ కూతురివైపే ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు.

జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం లేదు. షర్మిల తన కుమారుడి పిలుపు కోసం వెళ్లినప్పుడు కూడా విజయమ్మ షర్మిల వెంట వెళ్లలేదు. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్‌ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది.

కానీ విజయమ్మ అలాంటి ప్రయత్నం చేయలేదని జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థం అవుతుంది. షర్మిల వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా విజయమ్మ తటస్థంగా ఉంటారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు. రెండు, మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే.. కుమార్తెకే ఆమె మద్దతు ఉన్నట్లుగా తేలుతుంది.

Related posts

మినీ మేడారం జాతరకు వైద్య శిబిరం సిద్ధం

Satyam NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రయివేటు ఉపాధ్యాయులు

Satyam NEWS

తాగు నీటి సమస్యను పరిష్కరించిన అంబర్ పేట్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment