33.7 C
Hyderabad
April 29, 2024 01: 22 AM
Slider మెదక్

వీడిన ఎల్లంగౌడ్ హత్య కేసు మిస్టరీ

#Siddipet Police

పాత నేరస్తుడైన అంబటి ఎల్లం గౌడ్ హత్యకు సంబంధించి ఏడుగురు వ్యక్తులపై సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 23న రాత్రి 10 గంటలకు ఎల్లం గౌడ్ (40)హత్య జరిగిన విషయం తెలిసిందే. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంచ గ్రామ శివారులో జరిగిన ఈ హత్య సమాచారం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు.

వెంటనే డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్ పరిశోధన చేయాలని ఆదేశించారు. హత్య కేసును ఛేదించడానికి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, సిద్దిపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, చిన్నకోడూరు ఎస్ఐ సాయి కుమార్, సిబ్బందితో కలసి స్పెషల్  టీమ్  ఏర్పాటు చేశారు. ఎల్లం గౌడ్ భార్య భారతి ఏడుగురిపై ఫిర్యాదు చేయగా ఆ దిశగా కేసు పరిశోధించారు.

ముందు ముగ్గురు వ్యక్తులు దొరకగా తర్వాత మిగిలిన వారంతా పట్టుబడ్డారు. సిద్దిపేట మండలం తడ్క పల్లి కి చెందిన తొడేంగల వెంకటేష్, చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన ఎడ్ల మధుసూదన్ రెడ్డి, తూగుట మండలం పెద్ద మాసన్ పల్లి గ్రామానికి చెందిన కాస స్వామి, నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామానికి చెందిన బెజ్జంకి సంతోష్ కుమార్, సిద్దిపేట మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన చెన్నోజు నవీన్, ఆడే సంతోష్ నంగునూరు మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన చేట్టుగురి రవి, సిద్దిపేట పట్టణం రాంనగర్ కు చెందిన కార్మి అనిల్ లు ఎల్లంగౌడ్ తో కలిసి చేసిన నేరాలలో వాటాలు పంచుకోవడం వద్ద తగాదా వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే అతడిని హత్య చేసినట్లు నిర్ధారించామని సిద్దిపేట ఏసిపి రామేశ్వర్ సిద్దిపేట సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు.

Related posts

ఈనెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్

Satyam NEWS

సకాలంలో పంట ఋణాలు చెల్లించి లబ్ది పొందండి

Satyam NEWS

అద్వితీయుడు, క్రికెట్ ధీరుడు ధోనీ

Satyam NEWS

Leave a Comment