42.2 C
Hyderabad
April 26, 2024 17: 04 PM
Slider తెలంగాణ

నిన్న ఉత్తమ ఉద్యోగి – నేడు లంచగొండి

pjimage

గురువారం జరిగిన 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రాన్ని అందుకున్న కానిస్టేబుల్‌ ఈరోజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తిరుపతిరెడ్డి అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. చాలా మంచి సేవలు అందించేవాడు. అతని ప్రవర్తన నచ్చిన ఉన్నతాధికారులు తిరుపతిరెడ్డిని ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు. ఎంచక్కా తిరుపతిరెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం నాడు పతకం కూడా అందుకున్నారు. ఆహా తిరుపతి రెడ్డి ఎంత మంచివాడు అని అందరూ అనుకున్నారు. అయితే వెంకటాపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే ఇసుక వ్యాపారి దగ్గర కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి రెండు సంవత్సరాల నుంచి లంచాలు తీసుకుంటున్నాడు. ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ లంచంగా రూ.17 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని రమేష్ కు కోపం వచ్చింది దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆ ఇసుక వ్యాపారి నుంచి తిరుపతిరెడ్డి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే తిరుపతి రెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం మరో విశేషం. ఈ వివరాలన్నీఏసీబీ అధికారి కృష్ణ మోహన్ చెబుతుంటే అందరూ ముక్కున వేలేసుకున్నారు. అదీ సంగతి.

Related posts

మూడు కేసుల్లో 32ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు

Bhavani

విజయనగరం కలెక్ట్రెట్ లో సా దా సీదా గా అమరజీవి వర్ధంతి…!

Satyam NEWS

కాషన్ డిపాజిల్ వెంటనే రిటర్న్ ఇవ్వని తిరుమల దేవస్థానం

Satyam NEWS

Leave a Comment