33.7 C
Hyderabad
April 29, 2024 02: 30 AM
Slider గుంటూరు

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధుల విడుదల

#gopireddysrinivasareddy

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధుల విడుదలలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 50,337 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4.78 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శివ శంకర్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఒంగోలులో బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్ము జమ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషారెడ్డి, ఎమ్మార్వో రమణ నాయక్, నరసరావుపేట జెడ్పీటీసీ చిట్టిబాబు, ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావు, స్వయం సహాయక సంఘాల అక్కాచెల్లెళ్ళు పాల్గొనడం జరిగింది. జిల్లా లోని 40,508 స్వయం సహాయక సంఘాల్లోని 4,12,685 మంది అక్కచెల్లెమ్మలకు రూ.34,44,00,000/- ల లబ్ధి చేకూరింది. నియోజవర్గంలోని 4,958 సంఘాల్లోని 50,337 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4.78 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,615 కోట్లు సాయం అందించారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

మెదక్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం లో ఐదుగురి మృతి

Satyam NEWS

ఎన్నికల శిక్షణ పకడ్బందీగా చేపట్టాలి

Bhavani

మైదుకూరు మున్సిపాలిటీలో మాయ చేసిన వైసీపీ

Satyam NEWS

Leave a Comment