గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైభవంగా భోగి మంటల కార్యక్రమాలు నిర్వహించారు. నరసరావు పేట పట్టణం మొత్తం పండుగ వాతావరణం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాట్లను దగ్గరుండి మరీ సమీక్షించారు.
భోగి మంటలు వేసి పండుగలో వారిద్దరూ పాలుపంచుకున్నారు. అదే విధంగా మహిళకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు అందచేశారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలను వారు నిర్వహించి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.

భోగి పండుగ సందర్భంగా చిన్నారులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి భోగి పండ్లు పోశారు. టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీలు పెట్టి విజేతలకు బహుమతులు అందచేశారు. నరసరావుపేట టౌన్ హాల్ లో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా నరసరావుపేట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గంగిరెద్దులు, హరిదాసులు మొత్తం కార్యక్రమంలో సందడి చేశారు.