40.2 C
Hyderabad
April 26, 2024 13: 28 PM
Slider తెలంగాణ

గుర్తింపు ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే….

santosh

నాకు ఇంతటి గుర్తింపు ఇచ్చిన సమాజానికి, తిరిగి మరింతగా మంచి చేయాలన్న ఉద్దేశ్యంతోనే కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాను. రెండు నుంచి మూడేళ్లలో అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయటంతో పాటు, ఎకో టూరిజం, అర్బన్ ఫారెస్ట్ పార్కును పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తా అన్నారు రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్. పని విషయంలో  పట్టుదలను నేను కేసీఆర్ నుంచి నేర్చుకున్నాం. కేటీఆర్ స్పూర్తితో ఆయన జన్మదినం సందర్భంగా దత్తత తీసుకున్నా. పూర్తి స్థాయిలో పనుల తర్వాత కేటీఆర్ పుట్టినరోజు ఇక్కడే జరుపుతాము అని ఆయన అన్నారు. కీసరలో పర్యటించిన ఎం.పీ సంతోష్ ముందుగా రామ లింగేశ్వర స్వామి కి పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత కీసర ఎకో టూరిజం, అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 2.97 కోట్ల రూపాయలను అధికారులకు అందించారు.  అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి, అడవి మార్గంలో తిరిగి పరిశీలించారు. వ్యూ పాయింట్ వరకు వెళ్లి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున తరలి వచ్చిన స్థానికులు, విద్యార్థుల సహకారంతో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. క్షీణించిన అటవీ ప్రాంతంలో దాదాపు పదివేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నబహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అటవీ ప్రాంత అభివృద్దికి ఎం.పీ లాడ్స్ ఇచ్చిన మొదటి ఎం.పీ సంతోష్ అన్నారు. 1550 ఎకరాల అటవీ అభివృద్ది, చెరువు సుందరీకరణ, అటవీ ప్రాంతం మొత్తం ఫెన్సింగ్, ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు మరిన్ని నిధులు అవసరం అవుతాయని వాటిని కూడా సమకూర్చే బాధ్యత తీసుకోవాలని ఎం.పీని కోరారు.  కౌన్సిల్ విప్ పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పరిరక్షణకు  యువత ముందుకు రావాలన్నారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ శోభ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అర్బన్ పార్కులు, పచ్చదనం పెంపుకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈకార్యక్రమంలో ఇంకా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అదనపు అటవీ సంరక్షణ అధికారి చంద్ర శేఖర రెడ్డి, మేడ్చేల్ కలెక్టర్ ఎం.వీ రెడ్డి, అటవీ అధికారి సుధాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి వేంకటేశ్, మాజీ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి, ఎంబీసీ కార్పోరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, రాకేశ్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్లాక్ మెయిల్ కు గురయిన యువతి కి పోలీసులు అండ

Bhavani

అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ స్వాధీనం

Satyam NEWS

అజ్ఞాతం వీడిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్

Sub Editor

Leave a Comment