28.7 C
Hyderabad
April 26, 2024 09: 50 AM
Slider ముఖ్యంశాలు

కమిట్ మెంట్: ఇక పట్టణాల రూపురేఖలు మార్చేస్తాం

minister ktr

తెలంగాణ ప్రభుత్వం పట్టణం రూపురేఖలను మార్చేసే లక్ష్యంతో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నదని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలోని పురపాలికల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసియార్ మార్గదర్శనంలో పట్టణ ప్రగతి కార్యక్రమం రూపుదిద్దుకుందని, పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

రేపు మహబూబ్ నగర్ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, పట్టణాల్లో మంత్రులు,  స్ధానిక ఎమ్మెల్యేలు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం రేపటి నుంచి మార్చి 4వ తేదీ వరకు  కొనసాగనుంది. పట్టణ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కావాల్సిన కార్యచరణ చేపట్టేందుకు ఇప్పటికే అన్ని పురపాలికలకు ప్రభుత్వం మార్గదర్శకాలను పంపింది.

పట్టణాల్లోని ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను తీసుకోవాలని, ముఖ్యంగా పారిశుద్ధ్యం గ్రీనరీ, పౌర సేవల మెరుగు పరచడం వంటి ప్రధానమైన ప్రాథమిక లక్ష్యాలను నిర్ణయించినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ లో భాగంగా చెత్తను తరలించడంతో పాటు మురికి కాలువల శుభ్రం బహిరంగ ప్రదేశాల శుభ్రపరచ్చడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. 

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వార్డ్ యూనిట్ గా ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రతి వార్డుకి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పురపాలక శాఖ అధికారులు మార్గదర్శకాలను విడుదల చేశారు. రానున్న పది రోజులకు అవసరమైన కార్యక్రమాలను ముందే రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీలు ఏర్పాటు,  పబ్లిక్ టాయిలెట్స్ కోసం అవసరమైన స్థలాల గుర్తింపు వంటి పలు కార్యక్రమాలను గుర్తించింది.

పట్టణాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రజారోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలను, ఇందుకు అవసరమైన ఇయర్ క్యాలెండర్ ను ప్రకటించాలని మంత్రి కోరారు. పట్టణ ప్రగతి ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని ఇందులో భాగంగా ఘన వ్యర్ధాల, నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను చెరువులో కలపకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమాన్ని సైతం చేపట్టాల్సిందిగా కోరారు.

దీంతో పాటు పట్టణ ప్రగతిలో పౌరుల భాగస్వామ్యం అనేది అత్యంత కీలకమైన అంశమని ఇందుకోసం ప్రతి వార్డు వార్డు లో  కమిటీలను ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకు ఒకసారి వార్డు కమిటీల సమావేశం నిర్వహించడం , వివిధ అంశాలను చర్చించి వాటిపైన తగు చర్యలు తీసుకోవడం వంటి అనేక లక్ష్యాలను ప్రగతి లో భాగంగా చేపట్టనున్నట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన పురపాలక ప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలు తమకు అందించిన ఆశీర్వాదాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన పట్టణ ప్రగతి లక్ష్యాలను అందుకునేందుకు అందరూ కృషి చేయాలని పురపాలక ప్రజాప్రతినిధులతో పాటు పురపాలక శాఖ అధికారులను మంత్రి కోరారు.

Related posts

ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

Satyam NEWS

విలువైన ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

Bhavani

ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా సెంచరీ కి దగ్గరలో పెండింగ్ చలానాలు

Satyam NEWS

Leave a Comment