37.2 C
Hyderabad
April 26, 2024 21: 24 PM
Slider వరంగల్

ట్రాప్ రేప్: యువతిఫై 6 గురు మైనర్ ల అకృత్యం

attack and mob rape

పదహారేళ్లు కూడా నిండని వయసు అందరు మైనర్ లే వయసుకు మించి వారు చేస్తున్న అకృత్యాలేమో ఊహకు అందనివి. ఒకడు ప్రేమించానని ఓ యువతిని తీసుకు రావడం,మరో ఐదుగురు స్నేహితులు వాడి తో కలిసి నమ్మి వచ్చిన అమ్మాయి ఫై అత్యాచారం చేయడం ఎంత దారుణమో మీరే చూడండి. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలో ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనులు చేస్తున్నాడు.

అయితే అక్కడ అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. సొంతూరుకు వచ్చిన ఆ బాలుడు యువతికి ఫోన్‌చేసి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. మహబూబాబాద్‌ పట్టణానికి చేరుకున్న ఆమెను ఆటోలో తండాకు తీసుకెళ్లి అక్కడి నుంచి సమీపాన ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఆ బాలుడి స్నేహితులంతా చేరుకున్నారు.

అదే తండాకే చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన మరో ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు ఉన్నారు. వీళ్లంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు. ఆ యువతిపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో మామిడితోటలలో అరుపులు విని రహదారిపై వెళ్తున్న కొందరు అనుమానం వచ్చి డయల్‌ 100కు ఫోన్ చేసి సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆరుగురిపై కేసు నమోదుచేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ప్రజలు నోరెళ్ళ బెడుతున్నారు.చట్టాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే తెలంగాణ ప్రభుత్వం లో దిశా లాంటి ఘటనలు చూసైనా వీరు మారడం లేదని బాహాటం గానే విమర్శిస్తున్నారు.

Related posts

జే ఈ ఈ విద్యార్థికి లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయం

Satyam NEWS

ఆస్తి కోసం తగాదాలో చివరికి ప్రాణం పోయింది

Satyam NEWS

రైలులో హోంగార్డును చంపేసిన ఒక పిచ్చోడు

Satyam NEWS

Leave a Comment