32.7 C
Hyderabad
April 27, 2024 01: 22 AM
Slider కరీంనగర్

ప్రాబ్లెమ్:మానేరు నిండా నీరు నీటి కోసం బోరు బోరు

counsiler darna

తలాపున ఉరకలేస్తున్న మధ్య మానేరు రిజర్వాయర్‌ ఉన్నా వేములవాడ పట్టణ ప్రజలు నీటికోసం నానా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.పట్టణం లోని ఒకటి రెండు వార్డ్ లలో మినహా 28 వార్డ్ల లలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కుంటున్నారు.12 కిలోమీటర్ల దూరం శాబాష్ పల్లి లో మానేరు నిండు కుండలా నీటితో నిండి ఉండగా వేములవాడ ప్రజలు నీటికోసం అరిగోస పడుతున్నారు.

నీటి ఎద్దడి తీరుస్తూ ప్రజలకు నీరందించేందుకు ఇటీవలే నూతనం గా ఎన్నికయిన మున్సిపల్ పాలకవర్గం తీవ్రం గా శ్రమించాల్సి ఉంది.గెలిచి ఇంకా రెండు నెలలు కాక ముందే వాగు ఒడ్డుకు ఉన్న 20 వార్డులో నీటి కొరత తో ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవడం తో ఆ వార్డ్ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మున్సిపల్ కార్యాలయం లోనే ధర్నాకు దిగడం మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాస రెడ్డి అతన్ని ఊరడించడం తో పాటు నీటిని అందిస్తానని హామీ ఇవ్వడం తో ధర్నా విరమించాడు.

పట్టణం లో ఎల్ ఎం డి నుండి డైరెక్ట్ పైప్ లైన్ గుడి వద్దకు ఉండగా మిషన్ భగీరథ కూడా నీటిని అందించడం లో పూర్తిగా విఫలమైందని నీరు వచ్చే సమయం లో అందరు కరెంట్ మోటార్ లు వేసుకుని నీటిని పట్టడం తో దిగువన ఉన్నవారికి నీరు అందడం లేదని ప్రజలు వాపోతుండగా అధికారులు ఆ దిశగా అడ్డుకున్న పాపాన పోవడం లేదు.దీనితో నేటికీ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారు.


ట్యాంకర్ ల ఆదాయం కోసమేనా ?


గత 25 సంవాత్సారాలుగా వేములవాడ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోగా వాటర్ త్యాంక్ర్లు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు నీటిని అందించగా అందులో లెక్కకు మించి అవినీతి జరిగిందని పలు ఆరోపణలు ఉన్నాయి.ఒక ట్యాంకర్ నీరు పోసి ఐయిదు ట్యాంకర్ లు పోసినట్లు గా రికార్డులు తయారు చేసి అధికారులు,కౌన్సిలర్లు,చైర్మన్ లు డబ్బులు దండుకున్న విషయం ప్రజలందరికి తెలిసిందే.ఈ నేపత్యం లో కొందరు కృత్రిమ నీటి కొరత సృష్టించి ట్యాంకర్ల దందా చేస్తూ డబ్బులు వెనుకేసుకోవటానికి కొందరు సిద్ధమయినట్లు తెలుస్తుంది.నూతన పాలక మండలి,యువ కమిషనర్ లు ఈ ఆవినీతికి దూరం గా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.


కాళేశ్వరం ఉత్త షో కేసేనా ?


లక్షలాది ఎకరాలకు నీరు అందించేందుకు ,వేలాది ప్రజల దాహార్తి తీర్చేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ అపార భగీరథుడిలా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వేములవాడ ప్రాంత ప్రజల నీటి కస్టాలు తీర్చకుండా ఉత్త షో కేసు లానే మిగులుతుందా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న నీటితో మానేరు నిండు కుండలా మారి ఎక్సెస్ నీటితో తమ గ్రామాలు మునుగు తున్నాయని ముంపు గ్రామాల ప్రజలు ధర్నాలకు దిగుతుండగా వేములవాడ పట్టణ ప్రజలు తమకు నీరు కొరత ఉందని ప్రజాప్రతినిధులే ధర్నాలకు దిగడం కోసం మెరుపు.ఇప్పటికైనా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ,రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కె టి ఆర్ ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం కనిపెట్టాల్సి ఉంది.

Related posts

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సందర్శించిన ఉత్తమ్

Satyam NEWS

పాతపట్నంలో మాస్కులు పంపిణీ చేసిన ఎంజీఆర్

Satyam NEWS

చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి

Bhavani

Leave a Comment