40.2 C
Hyderabad
April 26, 2024 11: 13 AM
Slider సంపాదకీయం

వీరవనిత కథలో విలన్ పేరు ఎందుకు మార్చారు?

laxmi agrwal

బాలివుడ్ అందాల ముద్దుగుమ్మ డీగ్లామరైజ్డ్ రోల్ వేస్తే? అమ్మో అంత సాహసం చేసిందా? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. నిజమే గ్లామర్ వరల్డ్ లో ఇలాంటివి చేస్తే దాన్ని సాహసమనే అంటారు. బాలివుడ్ నటి దీపికా పదుకొనే ఇదే చేసింది.

2005 లో ఢిల్లీలో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ అనే యువతి జీవితానికి సంబంధించిన కథను ఎంచుకుని చెపాక్ అనే టైటిల్ తో హిందీ సినిమా రూపొందించారు. చెపాక్ చిత్రం నేడు విడుదల అయింది. పైన చెప్పిన విషయాలలో మనం అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది ఏమీ లేదు. తన జీవితాన్ని చిత్రంగా తీసి తనకు క్రెడిట్ ఇవ్వలేదని లక్ష్మీ అగర్వాల్ చిత్ర నిర్మాతలపై కోర్టుకు వెళ్లారు.

అందులో కూడా తప్పేం లేదు. అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది కూడా లేదు. అయితే ఈ చిత్రం చూసిన తర్వాత మన దేశంలో హిందూ మతం పట్ల ఎంత చులకన భావంతో ఉంటున్నారో అర్ధం అవుతుంది. దేవుడి బొమ్మలు పెట్టి చిత్రి విచిత్రమైన సినిమాలు తీస్తేనే హిందువులు ఏమీ అనరు పైగా ఆనందిస్తారు అనుకునే సినిమా వాళ్లు ఈ చిత్రంలో కూడా అదే చేశారు.

1990లో ఢిల్లీలో జన్మించిన లక్ష్మీ అగర్వాల్ అత్యంత పేద కుటుంబానికి చెందిన అతి సాధారణ అమ్మాయి. ఎంతో అందంగా ఉండే లక్ష్మీ అగర్వాల్ పై 32 ఏళ్ల వాడు ఒకడు కన్నేశాడు. వెంటపడ్డాడు వేధించాడు. లక్ష్మీ అగర్వాల్ లొంగలేదు. పేద పిల్ల అయినా వాడ్ని ఎదిరించింది. దాంతో వాడు లక్ష్మీ అగర్వాల్ పై యాసిడ్ తో దాడి చేశాడు. 2005 లో ఈ దాడి జరిగింది.

అప్పటికి లక్ష్మీ అగర్వాల్ వయసు కేవలం 15 సంవత్సరాలు. యాసిడ్ దాడి నుంచి కోలుకున్న లక్ష్మి తాను జీవితాన్ని కోల్పోదలచుకోలేదు. పోరాడాలనుకున్నది. దేశంలో యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించాలని ఉద్యమం నడిపింది. ఆమెకు దన్నుగా అలోక్ దీక్షిత్ అనే వ్యక్తి నిలిచాడు.

లక్ష్మి పోరాటం కారణంగా అప్పటి వరకూ యాసిడ్ దాడులకు కేవలం పరిహారం మాత్రమే ఇచ్చేవారు. ఆమె పోరాటం కారణంగా భారతీయ శిక్ష్మాసృతిని సవరించి యాసిడ్ దాడులకు శిక్ష ఖరారు చేశారు. యాసిడ్ దాడి జరిగి మొహం వికృతంగా మారిన వారి పునరావాసం ప్రభుత్వమే కల్పించాలని ఆమె చేసిన పోరాటం కూడా సఫలీకృతమైంది.

ఇలా జీవితంలో అన్నీ విజయాలే సాధించిన లక్ష్మిపై యాసిడ్ దాడి చేసిన వాడు నయీమ్ ఖాన్. లక్ష్మీ అగర్వాల్ పేరును ఈ చెపాక్ చిత్రంలో మాలతి గా మార్చారు. మాలతి పాత్రను దీపికా పదుకొనే అద్భుతంగా ప్రదర్శించింది. మరి యాసిడ్ దాడి చేసిన వాడి పేరును నయీమ్ ఖాన్ తీసేసి వేరే ఏదో ఖాన్ గా పెట్టాలికదా?

అలా పెట్టలేదు. రాజేష్ శర్మ అని పేరు పెట్టారు. ఏం ముస్లిం పేరు పెట్టడానికి భయమా అని హిందూ సంఘాల వారు మండిపడుతున్నారు. ఏదో కల్పిత కథ అయితే ఎవరికి ఏం పేరు పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండదు. నిజమైన కథను తెరకెక్కిస్తున్నప్పుడు అలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం పట్టించుకోవద్దు. సినిమాను సినిమాగానే చూడండి అని చెప్పడం చాలా సులభం కానీ యాసిడ్ దాడి చేసిన వాడు ఖాన్ అయినప్పుడు రాజేష్ శర్మ పేరు పెట్టడం ఏమిటి అనేది మాత్రం అడగాల్సిన ప్రశ్నే.

Related posts

నిరుపేదలకు నిత్యావసరాలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

టీటీడీ ధర్మకర్తల మండలా? దర్శనాల మండలా?

Satyam NEWS

ఎమ్మెల్సీ రమణ కుటుంబాన్ని పరామర్శించిన కవిత

Bhavani

Leave a Comment