28.7 C
Hyderabad
April 27, 2024 03: 47 AM
Slider తెలంగాణ

కొత్త తరానికి ఆదర్శం అంటే ఇలా ఉండాలి

teacher

అందరూ నీతులు చెబుతారు కానీ చాలా మంది పాటించరు. వేరేవారి సంగతి ఎలా ఉన్నా బోధన వృత్తిలో ఉన్న వారు ఏం చెబుతున్నారు ఏం చేస్తున్నారు అనేది సమాజం మొత్తం గమనిస్తూ ఉంటుంది. అలాంటి టీచర్ ఆదర్శంగా ఉంటే సమాజం మొత్తం నీతి నిజాయితీతో ఉంటుంది. కరీంనగర్ జిల్లా ఏల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళుతున్న టిఏస్ఆర్టీసీ బస్సులో ఒక ఉపాధ్యాయుడికి 50 వేల రూపాయల నగదు దొరికింది. ఏల్లారెడ్డిపేట కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొడ్ల సంజీవ్ ఈ డబ్బును చూసి ఆశపడలేదు. పాపం ఎవరు పొగొట్టు కున్నారో అని కొద్ది సేపు ఆలోచించాడు. వెంటనే  సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీ నివాస్ చౌదరికి అప్పగించి తన నిజాయితీ నీ చాటు కున్నాడు. ఏల్లారెడ్డిపేట మండలం  రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయో సైన్స్ భోదించే  ఉపాధ్యాయులు  దోడ్ల సంజీవ్ తన డ్యూటీ మిగించుకొని సిరిసిల్ల కు AP 15 Z 0044 నెంబర్ టిఏస్ఆర్టీసీ బస్సులో వెళుతుండగా ఏవరో వ్యక్తి పోగోట్టుకున్న 50 వేల నగదు  దొరికింది. దొరికిన డబ్బులను నిజాయితీ తో అప్పగించిన సంజీవ్ ను సిరిసిల్ల సిఐ శ్రీ నివాస్  చౌదరి, ఏల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, టిఆర్ఏస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, బోమ్మకంటి భాస్కర్లతో పాటు  పలువురు అభినందించారు.

Related posts

హన్మకొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Satyam NEWS

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

Satyam NEWS

తాగి కారు నడిపి ఇద్దర్ని చంపిన కొడుకును కాపాడేందుకు….

Satyam NEWS

Leave a Comment