ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 31 న జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 31 వ తేదీ తరువాత పరిస్థితి ఆధారంగా పరీక్షల తేదీలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి రెండు వారాల పాటు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.