చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీ అదుపుతప్పి ఆ టో, బైకు, కారుపైకి దూసుకురావడంతో 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుకి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. బైక్ కాలి బైడిదైంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు-బెంగళూరు హైవేపై జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం.
previous post
next post