32.7 C
Hyderabad
April 26, 2024 23: 49 PM
Slider ఆధ్యాత్మికం

జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి

#ttd

జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి  జరుపనున్నారు. గతంలో లాగా పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. పదిరోజులకు సంభందించి తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు ఇస్తారు. జనవరి 2 న రాజ్యాంగ హోదాలో విఐపీలు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. జనవరి 2 నుండి 11 వ తేదీ వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టోకన్లు కేటాయింపు జరుగుతుంది. జనవరి 1వ తేదీ సర్వదర్శనం టోకన్లు కౌంటర్ ప్రారంభం అయి టోకన్లు పూర్తయ్యేదాకా తిరుపతిలో కౌంటర్లు తెరచివుంటాయి. వైకుంఠద్వారా దర్శనానికి సంభందించి రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల రూ 300 దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్ లో కేటాయిస్తారు. ఆనందనిలయం బంగారు తాపడం పనులకు గానూ ఫిబ్రవరి 23 వ తేదీన బాలాలయం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు. శ్రీవారి మూలవిరాట్టుకు నిత్య సేవలు నిర్వహణతో పాటు భక్తుల దర్శనం యధావిధిగా కొనసాగుతుంది.

కాగా గతంలో జరిగినట్టే బంగారు తాపడం పనులు చేస్తాం ఆని, భక్తులు హుండీలో సమర్పించిన స్వర్ణ కానుకలతో ఆనందనిలయానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయం  జరిగిందని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం 331 ఆలయాలు నిర్మాణ దశలో ఉన్నాయని, మరో 1100 పైగా ఆలయాలను త్వరితగతిన నిర్మాణాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టి‌టి‌డి ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. రెండవ ఘాట్ రోడ్డులో రక్షణ గోడలు నిర్మాణానికి 9 కోట్లు, తిరుమలలో స్థానికులు నివసిస్తున్న బాలాజీ నగర్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ 3.70 కోట్లు, జమ్మూ కాశ్మీర్ లో నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయం వద్ద సదుపాయాలు ఏర్పాటుకు రూ 7 కోట్లు, టీటీడీ ఆసుపత్రుల్లో ఔషదాలు, సర్జికల్ పరికరాలు కొనుగోలుకు రూ 2.86 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి 3.75 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Related posts

పులివెందుల దేవాలయాల్లో దోపిడి దొంగల స్వైరవిహారం

Satyam NEWS

వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు

Satyam NEWS

సిఎం సొంత జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు

Satyam NEWS

Leave a Comment