చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అనుమానంతో 50 సంవత్సరాలకు పైబడిన సురేష్ అనే వ్యక్తి కి దేహశుద్ధి చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని ప్రగతి నగర్ ఏరియా లో ఈ సంఘటన జరిగింది. అక్కడ నివాసం ఉంటున్న అమ్మమ్మ గారి ఇంటికి ఇద్దరు కవల పిల్లలు వచ్చారు. సుమారు నాలుగైదు సంవత్సరాలు గల ఆ చిన్నారులు రోడ్డుపై వెళ్తున్న సురేష్ అనే వృద్ధుడు వద్దకు వచ్చి తాత బిస్కెట్లు కొనుక్కోడానికి రెండు రూపాయలు ఇవ్వవా అంటూ అడిగారు. ఆ చిన్నారులకు బిస్కెట్లు కొనిచ్చిన సురేష్ అభం శుభం తెలియని ఆ చిన్నారులను ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్లిన అతడు ఇద్దరు చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో ఆ కుటుంబ సభ్యులు సురేష్ ను పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
previous post
next post