29.7 C
Hyderabad
April 29, 2024 09: 38 AM
Slider ఖమ్మం

ఉపాధ్యాయుడైన కలెక్టర్

#kmmdc

తొలిమెట్టు ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.  కలెక్టర్ కొణిజేర్ల మండలం గుబ్బకుర్తి గ్రామ పంచాయతీ లల్లోరిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, తీగలబంజర లోని మండల పరిషత్ ప్రాధమికొన్నత పాఠశాలల్లో తొలిమెట్టు అమలు, విద్యార్థుల ప్రగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. 3వ, 5వ తరగతి విద్యార్థులను కలెక్టర్ ప్రశ్నలు అడగడం, అభ్యాసన చేయించడం ద్వారా పరిశీలించారు. సరళ పదాలు చదవడం, కూడికలు చేయడంలో ప్రగతిని పరిశీలించారు. పదాలు ఎలా చదువుతుంది, కూడికలు ఏ విధంగా చేస్తుంది విద్యార్థులతో చెప్పించారు. తొలిమెట్టు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి, 20, డిసెంబర్ లోగా నవంబర్ మాసాంతానికి నిర్దేశించిన లక్ష్యాలు వంద శాతం సాధించాలని కలెక్టర్ అన్నారు. ఇంగ్లీష్, తెలుగు చదవడంలో ఇంకనూ వెనుకబడి వుండడంపై, మండల విద్యాధికారి ని ప్రత్యేక దృష్టి పెట్టి పర్యవేక్షణ చేయాలని, ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని అన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా మండల విద్యాధికారి శ్యామ్ సన్, ఏఎంఓ రవికుమార్, ప్రధానోపాధ్యాయులు పద్మావతి, మండల తహసీల్దార్ సైదులు, టీఎస్ఇడబ్ల్యుఐడిసి డిఇ వైకుంఠాచారి, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

బాసరలో అఖండ హరినామ సప్త ప్రవచనం

Satyam NEWS

సుప్రీంకోర్టుకు చేరిన జోషిమఠ్ భూమి కుంగుబాటు అంశం

Bhavani

టేక్ ఆక్షన్:రాధిక హంతకుని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment