30.2 C
Hyderabad
October 13, 2024 16: 56 PM
Slider హైదరాబాద్

మూడో రిపోర్టర్ ను ఏసీబీ అధికారులు కావాలనే వదిలేశారా

reportes

హైదరాబాద్ లో నిన్న జూబ్లీ హిల్స్ లో  టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రూ. 2లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఇద్దరు విలేకరులతో పాటు మరో కీలక వ్యక్తిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకోలేకపోయారా లేక కావాలనే వదిలేశారా అనే చర్చ జరుగుతున్నది. టౌన్ ప్లానింగ్ అధికారితో బాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మూడో వ్యక్తి కూడా విలేకరి అనే విషయం తెలిసింది. ఈ ముఠాలో కీలక పాత్ర ఇతడిదే ననే ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురు రిపోర్టర్లు కలిసి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న వైనంపై విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఇటీవల కమాలపురి కాలనీలో ఓ బిల్డర్ వద్ద రూ 7 లక్షలు తీసుకున్న వైనం.. సోషల్ మీడియా లో కాల్ రికార్డింగ్..సంచలనం కలిగిస్తున్నాయి. ఈ విలేకరుల ముఠా మూడేళ్లుగా వెస్ట్ జోన్ పరిధిలో అనేక మంది బిల్డర్స్, ఇళ్ళ యజమానులను బెదిరిస్తూ కోట్లాది రూపాయలను వేసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Related posts

సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి అన్ని శాఖలపై అవగాహన

Satyam NEWS

హజ్ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు

Bhavani

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

Satyam NEWS

Leave a Comment