32.7 C
Hyderabad
April 27, 2024 00: 17 AM
Slider ఆంధ్రప్రదేశ్

యాంటీ కరప్షన్: మునిసిపాలిటీలలో చెత్త దులిపిన ఏసిబి

municipal

తొలిరోజు ముగిసిన రాష్ట్రవ్యాప్త మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. వాటి వివరాలను ఏసీబీ డీజీ పీయస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 13 జిల్లాలలో 14 టీములుగా 100 మందికి పైగా అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో 1,03,813 రూ. లెక్కల్లో లేని నగదు, సంబంధం లేని ఇద్దరు ప్రైవెటు వ్యక్తులు, అనధికారిక కట్టడాలపై నిర్లక్ష్యపూరిత విధానం, పలు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో 8,940 లెక్కల్లో లేని నగదు గుర్తించారు.

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ లొ జరిగిన తనిఖీలలో 15,110 రూ. లెక్కల్లో లేని నగదు, టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న ఒక ప్రైవేటు వ్యక్తిని అధికారులు గుర్తించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో అసిస్టెంట్ సిటి ప్లానర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రైవేటు వ్యక్తి  గుర్తింపు, 13,16,335 రూ. పెండింగ్ అడ్వటైజింగ్ టాక్స్ వసూలు పట్ల ఏడాదిగా నిర్లక్షం, అనధికార కట్టడాల పట్ల చర్యలు తీసుకోకపోవడం , సిటిజన్ చార్ట్ ను మెయింటెన్ చేయకపొవడం వంటివాటిని అధికారులు గుర్తించారు.

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో 24 బిల్డింగ్స్ కు BPS ధరఖాస్తులను పెండింగ్ లోనే ఉంచినట్టు గుర్తించారు. తాడేపల్లి గూడేం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో సిబ్బంది దగ్గర లెక్కల్లో లేని 5640 రూ. నగదు, మంధ్లీ లిస్ట్ సరిగా మెయింటెన్ చేయకపోవడం, ఇన్స్ పెక్షన్ సరిగా చేయకపోవడం, apdms ద్వారా వచ్చిన 206 ధరఖాస్తులలో 4 ధరఖాస్తులకు 15:రోజుల్లోనే పర్మిషన్స్ ఇచ్చినట్టు గుర్తించారు.

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో  అధికారుల వద్ద 14,690 రూ. లెక్కల్లో లేని నగదు, అనధికారిక కట్టడాలకు పర్మిషన్స్ ఇచ్చినట్టు గుర్తించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో అధికారుల వద్ద 7740 రు. లెక్కల్లో చూపని నగదు, 5000 జీతంతో ప్రైవేటు వ్యక్తి విధులు నిర్వహణ,  2309 బిల్డింగ్ లకు BPS ధరఖాస్తులను పెండింగ్ పెట్టినట్టు గుర్తించారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో  టౌన్ ప్లానింగ్ లోని 12 మంది సిబ్బంది నుండి 34650 రూ. లెక్కల్లో చూపని నగదు,  అనధికార కట్టడాల కూల్చివేతలలో నిర్లక్ష్యం, అనధికారి కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చినట్టు గుర్తించారు. మధురవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తిని అధికారులు గుర్తించారు.  గాజువాక మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో అధికారుల వద్ద 29,900 లెక్కల్లో చూపని నగదు, కంప్యూటర్ ఆపరేటర్లు గా ఉన్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీలలో అధికారుల, సిబ్బంది వద్ద 2,87 ,263 రూ. లెక్కల్లో లేని నగదు సీజ్ చేశారు.

Related posts

స్వధార్ ఆశ్రయంకు ఆహార పదార్ధాల అంజేత

Satyam NEWS

సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం

Satyam NEWS

(Over|The|Counter) Is Cbd Topical With Hemp Addictive Cbd Flower Hemp Review Cbd Oil From Hemp Vs Marijuana

Bhavani

Leave a Comment