37.2 C
Hyderabad
April 26, 2024 19: 57 PM
Slider విజయనగరం

పోలింగ్ కేంద్రాల పరిశీలన.. పీస్ కమిటీ సమావేశం

#VijayanagaramCI

రాష్ట్రంలో  జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్ కు ఇంకా అయిదురోజుల మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల పదో తేదీన రాష్ట్రంలో 12 కార్పొరేషన్ లు ,75 మున్సిపాలిటీ లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కై అటు రెవెన్యూ, ఇటు పోలీసు,అలాగే పట్టాభివృధ్ధి శాఖ లు సమావేశాలు నిర్వహించడం ,పోలింగ్ బూత్ లను పరిశీలించడం జరుగుతోంది.

ఇందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ సూచనలతో సంబంధిత పోలీస్ శాఖ సిబ్బంది పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీసులు ఓ వైపు పోలింగ్ కేంద్రాల పరిశీలన మరోవైపు శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సమాత్తం అయ్యారు.

విజయనగరం డీఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో నగర పోలీసులు పది ప్రదేశాల్లో అదీ సమస్యాత్మక పోలింగ్ బూత్ లను పరిశీలించారు. మరీ ముఖ్యంగా వీటీ అగ్రహారం, ఉడాకాలనీ, బొగ్గులదిబ్బ ప్రదేశాలతో పాటు ఎనిమిది చోట్ల ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.అదే విధంగా సాలూరు మున్సిపాలిటీ జరగనున్న ఎన్నికలకు సంబంధించి… సీఐ అప్పలనాయుడు… శాంతియుతంగా ఎన్నికల నిర్వహించాలనే ఉద్దేశ్యం తో పురప్రముఖులతో శాంతి పూర్వక సమావేశాన్ని నిర్వహించారు.

ఇటీవల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు గాను…పోలీసు శాఖ కు మంచి పేరు వచ్చిందని…ఒక్క చౌడవాడ ఘటన మినహా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు గానూ ఎస్పీ రాజకుమారీ స్వయంగా సిబ్బంది ప్రోత్సాహక రూపంలో నగదును కూడా అందజేశారు.

తర్వాత వచ్చిన ఈ మున్సిపల్ ఎన్నికలను అదే రీతిలో శాఖకు పేరు తెచ్చే విధంగా ఎన్నికల విధులు నిర్వహించాలని ఎస్పీ సమావేశంలో పేర్కొనడంతో తదనుగుణంగా సిబ్బంది దిశగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి.

Related posts

కరోనా ఎఫెక్ట్ తో ప్రజావాణి కార్యక్రమం రద్దు

Satyam NEWS

ఇద్దరు కానిస్టేబుళ్లు పై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

కరీంనగర్, మహబూబ్ నగర్ లలో ఐటి హబ్ లు

Satyam NEWS

Leave a Comment