30.7 C
Hyderabad
April 29, 2024 05: 27 AM
Slider మెదక్

చినజీయర్ స్వామి పర్యటనకు దుబ్బాకలో పోలీసుల ఏర్పాట్లు

#dubbaka

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 20వ తారీకు నాడు  శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ  కార్యక్రమం ఉన్నందున టెంపుల్ తదితర ప్రాంతాలను పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ  చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, కమిటీ సభ్యులతో జరిగే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

20 తారీకు నాడు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, ఇతర వీఐపీలు వస్తున్నందున పార్కింగ్ ప్రదేశాలు, అవుట్ గేట్, ఇన్ గేట్, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగు ప్రదేశాలను ఆలయ చుట్టూ ఆవరణను కమిటీ సభ్యులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి భక్తులందరూ క్రమశిక్షణతో దేవుని దర్శించుకుని వెళ్లాలని సూచించారు. బందోబస్తు గురించి అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిద్దిపేట ఏసిపి సైదులు, దుబ్బాక సిఐ హరికృష్ణ గౌడ్ లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డిఓ అనంతరెడ్డి, జిల్లా డిఆర్డిఓ పిడి గోపాల్ రావు, సిద్దిపేట ఏసిపి సైదులు, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి, దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ వనిత భూంరెడ్డి, దుబ్బాక సిఐ హరికృష్ణ గౌడ్, సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రాజశేఖర్, దుబ్బాక ఎస్ఐ స్వామి, మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్, మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పోలీసులు చేసిన సేవ ఏంటో…కేంద్రానికి చెప్పిన క‌రోనా మ‌హిళా వారియ‌ర్

Satyam NEWS

చంద్రబాబు అరెస్ట్ అక్రమం: టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్

Satyam NEWS

పిల్లవాడి ప్రాణం తీసిన మంచినీళ్ల వ్యాపారం

Satyam NEWS

Leave a Comment