ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకునేలా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని నాగర్ కర్నూల్ ఎస్ పి డాక్టర్ వై సాయి శేఖర్ ఆదేశించారు. ఎవరికి అప్పగించిన విధులను వారు బాధ్యతగా నిర్వర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కోరారు.
మున్సిపాలిటీ ఎన్నికల విధులకు హాజరు కావలసిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆయన నేడు సూచనలు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి సుమారు 500 మంది తో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ప్రతి మున్సిపాలిటీలో సుమారు 100 మంది కి పైగా అదనపు పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన వివరించారు. వీరితో పాటు స్పెషల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో మూడు ప్రాంతాలలో డి.ఎస్.పి.లు మోహన్ రెడ్డి, నర్సింహలు, గిరి బాబు బందోబస్తు సిబ్బందిని సంబంధిత స్థలాలను పంపారు. ఇందులో సీఐలు గాంధీ నాయక్, నాగరాజు, సైదులు, వెంకట్ రెడ్డి, బీసన్న, రామకృష్ణ, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.