37.2 C
Hyderabad
April 26, 2024 20: 22 PM
Slider ముఖ్యంశాలు

ప్రతీఒక్కరూ మట్టిగణపతినే పూజించాలి: పర్యావరణాన్ని పరిరక్షించాలి

#janasena

ప్రతీ ఒక్కరు మట్టి గణపతిలనే వాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని జనసేన పార్టీ కోరింది. ఈ మేరకు జనసేన పార్టీ చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి  కాటం అశ్వని స్థానిక 33వ డివిజన్,బాలాజీ నగర్, శ్రీనివాస జూనియర్ కళాశాల వద్ద మూడువందల వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ కార్యక్రమం చేశారు.

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పాలవలస యశస్వి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరూ నడుంబిగించాలన్నారు. అందుకే ప్రజలందరూ మట్టిగణపతి నే పూజించాలని పిలుపినిస్తూ.. మన తెలుగువారు మొట్టమొదట జరుపుకొనే వినాయక చవితి పండుగను నిషేధంచడం, విగ్రహావిక్రయాలను అడ్డుకోవడం చరిత్రలోనే ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు.

స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి జరుపుకోడానికి వైఎస్సార్సీపీ ప్రభ్యత్వానికి కరోనా నిబంధనలు లేవుగాని, హిందువులు అందరూ పూజించే గణపతి పూజలకు, దానిపై ఆధారపడే కళాకారులకు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ తో సహా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో హైకోర్టు జోక్యం చేసుకుని పండుగకు విఘ్నాలు తొలగడం ఆనందదాయకమని,ప్రజలంతా కరోనా నిబంధనలతో పండుగను జరుపుకోవాలని అన్నారు.

కార్యక్రమ నిర్వాహకురాలు, జనసేన చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్వని మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ అని,దానిలో భాగంగా నే మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టామని, ఈ విధంగా పవన్ కళ్యాణ్, మరియు జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా నేతలు పద్మశ్రీ దాస్,జనసేన పార్టీ సీనియర్ నేతలు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు),బూర్లీ విజయ్,కె.ఎస్.ఆర్.కుమార్, మజ్జి శివశంకర్, పార్టీ మైనార్టీ నేతలు హుస్సేన్ ఖాన్, చెల్లూరి ముత్యాల నాయుడు,రవిరాజ్ చౌదరి, రఘు,కిలారి ప్రసాద్,రవితేజ, లోక్ నాధ్,సాయి కిరణ్,తేజ,జగదీష్,పిడుగు సతీష్,ఏంటి రాజేష్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమంగా మోపిన ఉపా కేసు ను వెంటనే ఎత్తివేయాలి

Bhavani

వర్కింగ్ స్పీకర్: నిజాంసాగర్ నీటిని జాగ్రత్తగా వాడాలె

Satyam NEWS

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం: వనపర్తి జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment