38.2 C
Hyderabad
April 29, 2024 20: 09 PM
Slider సంపాదకీయం

అధికార పార్టీ రాజకీయ అనివార్యత ‘ఏకగ్రీవం’

#Y S Jagan

పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై బహుముఖ ప్రచారం చేసిన అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన విషయాన్ని మర్చిపోయింది. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ ను అగౌరవ పరిచేందుకు మాత్రమే నిర్ణయించుకున్న అధికార పార్టీ ఏకగ్రీవాలకు యుద్ధం మొదలు పెట్టింది.

అసలు విషయం ఏమిటంటే ఈ సారి పంచాయితీ ఎన్నికలలో నోటా ప్రవేశ పెట్టారు. ఏ అభ్యర్ధికి ఓటు వేసేందుకు ఇష్టం లేకపోతే నోటా పై ఓటు వేయవచ్చు. నోటా ప్రయోగం గతంలో ఉండేది కాదు. నోటా లేని సమయంలో పంచాయితీలను ఏకగ్రీవం చేసేవారు.

గ్రామాలలో పార్టీ రహితంగా పాలన జరగాలని అప్పటిలో ఆశించి అలా చేసేవారు. గ్రామ స్వపరిపాలనలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉండాలనే ఉదాత్తమైన ఆశయంతో కూడా అలా చేసేవారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి రాజకీయాలు గ్రామ స్థాయికి చేరిపోయాయి.

ఇప్పుడు గ్రామాలను రాజకీయ పార్టీల నుంచి వేరు చేయడం సాధ్యం కాదు. అయినా సరే పంచాయితీ ఎన్నికలను సూత్ర ప్రాయంగా రాజకీయ పార్టీ గుర్తులు లేకుండా నిర్వహిస్తున్నారు. ఇక పోతే ఏకగ్రీవ ఎన్నికల విషయానికి వస్తే అధికార పార్టీకి కలిసి వచ్చే అంశం.

అసాధారణ పరిస్థితి కల్పించుకున్న అధికార పార్టీ

నయానో భయానో ఏకగ్రీవాలు చేసుకోవడానికే అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. గతంలో అధికారంలో ఉన్న పార్టీల పరిస్థితి వేరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. సాధారణ పరిస్థితులు వేరు. ఇప్పుడు డాక్టర్ రమేష్ కుమార్ నేతృత్వంలో పంచాయితీ ఎన్నికలు జరగరాదనే పట్టుదలతో ఉన్న పరిస్థితి వేరు.

దాంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని దౌర్జన్యాలకు దిగుతూ ఏకగ్రీవాలు చేసుకుంటున్నది. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో మరో ఆసక్తికర పరిణామం నోటా. ఇప్పటివరకూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో మాత్రమే కనిపించే ‘నోటా’ మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో కూడా స్థానం దక్కించుకుంది.

పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు మాత్రమే బ్యాలెట్ పత్రంలో ముద్రిస్తారు. ఈ బ్యాలెట్ పత్రంలో గుర్తులన్నింటి కంటే చివరన ‘నోటా’ను కూడా చేర్చడం విశేషం.

నోటా జమానాలో ఏకగ్రీవం ఎలా….?

సాధారణంగా పంచాయతీ ఎన్నికల కోసం పదహారు గుర్తులతో బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తారు. ఈ విధంగా ముద్రించిన బ్యాలెట్‌లో అట్టడుగున ‘నోటా’కు చోటిచ్చారు. పోటీలో ఉన్న ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు వేసుకోవచ్చు.

మరి ఈ సందర్భంలో అంటే నోటా ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవాలు ఎలా జరుపుతారు? అందరూ కలిసి ఒకే అభ్యర్ధిని పెట్టినా బ్యాలెట్ పేపర్ వేయాల్సిందే. ఎందుకంటే అక్కడ నోటా ఉంటుంది కాబట్టి. నోటా ఉన్న ఈ సమయంలో ఏకగ్రీవాలు అనే ప్రశ్నే తలెత్త కూడదు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవేవీ పట్టించుకునే పరిస్థితి లేదు….. కారణం కేవలం ఒకే ఒక్క వ్యక్తి. ఆయనే నిమ్మగడ్డ.

Related posts

టీఆర్ఎస్ అప్రజాస్వామిక వ్యవహారశైలి

Satyam NEWS

జనతా కర్ఫ్యూ: నాలుగు చెంచాల ఆముదం మందు

Satyam NEWS

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం: వనపర్తి జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment