27.2 C
Hyderabad
September 21, 2023 22: 15 PM
Slider ఆంధ్రప్రదేశ్ సినిమా

సీఎం జగన్ ఆశీస్సులతో ప్రారంభమైన ఆటో రజని

hero jagan

జెఎస్ఆర్ మూవీస్ పతాకం పై బి.లింగుస్వామి సమర్పణ లో జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్యం వహిస్తున్న చిత్రం ఆటో రజని. ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన  డాన్స్ లతో, యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా వస్తున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ చిత్రం ఆటో రజని. జొన్నలగడ్డ హరిక్రిష్ణ ద్వితీయ చిత్రం అయిన ఈ సినిమా కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సలు అందించారు. ఎంతో బిజీ గా ఉండి  కూడా ఇండస్ట్రీలో కి కొత్తగా వచ్చిన మా హీరోకి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది అంటున్నారు దర్శకులు జొన్నలగడ్డ. తాడేపల్లి లోని వైస్సార్సీపీ కార్యలయం లో సిఎం వైస్ జగన్ కలసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు జొన్నలగడ్డ హరికృష్ణ. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రం గా మా ఆటో రజని నిలిచిపోతుంది అంటున్నారు దర్శక, నిర్మాతలు. అంతే కాకుండా ఎలెక్షన్ టైం లో మేము చేసిన ‘జననేత జగనన్న’ పాట గురించి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆయన అభినందించడం జీవితంలో మర్చిపోలేమని వారన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. హీరోయిన్ ఇంకా ఇతర పాత్రలు ఎవరు అనేది పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ తెలిపారు

Related posts

కలెక్షన్ల వర్షం: పాత రికార్డులు బద్దలు కొడుతున్న పఠాన్

Satyam NEWS

ఐదు భద్రత పట్ల అవగాహన, ఆచరణకే “శౌర్య”

Bhavani

బిసి కులాలు ఐక్యంగా ముందుకు రావాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!