28.7 C
Hyderabad
April 27, 2024 06: 17 AM
Slider విజయనగరం

ఎరుపు రంగు గా మారిన విజయనగరం కలెక్టరేట్ జంక్షన్…!

#protest

గంటన్నర సేపు నిలచిపోయిన వాహనరాకపోకలు

దాదాపు గంటన్నర పైగా విజయనగరం లో కలెక్టరేట్ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసు బ్యారెక్స్ నుంచీ యూత్ హాస్టల్ వరకు రహదారి పై వాహనాలు నిలచిపోయాయి. తమకు వేతనాలు పెంచాలని…రెగ్యులర్ చేయాలని అంగన్ వాడీలు ధర్నా చేయడమే..వాహనాల నిలుపుదలకు కారణం. తొలుత కలెక్టరేట్ ఇన్ గేట్ వద్ద..ధర్నా కు దిగిన అంగన్ వాడీలు.. అక్కడ నుంచీ ర్యాలీ గా….యూత్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు.

ఆ సమయంలో నే సీఐటీయూ, ఏఐటీయూసీ లు ధర్నా లు చేయడంతో… అంగన్ వాడీలంతా..స్థలం మార్చి పోలీసులకే ఝలక్ ఇచ్చారు. దాదాపు రెండు వేల మంది మహిళా వర్కర్లు… యూత్ హస్టల్ వద్దే జాతీయ రహదారిపై నే భైఠాయించారు.దీంతో కిలో మీటర్ల మీదట వాహనాలు నిలచిపోగా….అందులో మూడు అంబులెన్స్ లు ఇరుక్కుపోయాయి.

దీంతో ఖాకీ లకు పని పడటంతో వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు, రూరల్ సీఐ తిరుపతి రావు..ఎస్ఐలు భాస్కరరావు, గణేష్, రామ్ గణేష్ లు…మహిళలు అక్కడ నుంచీ చెదరగొట్టే యత్నం చేసారు. అయితే ప్రత్యేకించి మహిళా కానిస్టేబుల్లను పిలిపించి… అంగన్ వాడీ లను తరలించి… మొదట అంబులెన్స్ లకు తోవ ఇవ్వడంతో… మెల్లిగా మిగిలిన ఖాకీలంతా…అంగన్ వాడీల ధర్నా కు వచ్చిన మహిళలను చెదరగొట్టి…ఎట్టకేలకు… గంటన్నర తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనాలకు కదిలాయి.

Related posts

గోడదూకిన డొక్కా ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ

Satyam NEWS

మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల పెంపునకు చర్యలు

Satyam NEWS

Leave a Comment