తెలంగాణ లో రెండోసారి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరలేపి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారు ఎక్కినట్లు గుర్తు. ఆయన సిఎం కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడని అందువల్ల ఆయనకు కేబినెట్ హోదా ఇస్తారని కూడా వార్తలు వినవచ్చాయి. సరిగ్గా ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం సండ్రపై కన్నెర్రజేసిందట. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరిగిందో తెలియదు కానీ అందరూ నామా నాగేశ్వరరావు పై అనుమానపడుతున్నారు. అది వేరే విషయం కానీ సండ్ర వెంకట వీరయ్య ప్రస్తుతం టీడీపీలో ఉన్నారా? లేదా ఆయనకే తెలియని పరిస్థితి!ఈ వ్యవహారంపై తాజాగా సండ్ర మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘నేను ప్రస్తుతం గాలిలో ఉన్నాను. అసెంబ్లీ స్పీకర్ జాబితాలో ఎలా ఉంటే నేను ఆ పార్టీలో ఉన్నట్టు’ అని సండ్ర వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వెబ్‌సైట్‌లో టీడీపీ ఎమ్మెల్యేగానే సండ్ర ఉన్నారు.
previous post
next post