27.7 C
Hyderabad
April 26, 2024 05: 53 AM
Slider ప్రత్యేకం

తాజాగా అదే ఏఆర్ విభాగం ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కూడాను….!

#arconstable

ఇటీవ‌లే ఏఆర్ ఇన్ స్పెక్ట‌ర్ ఈశ్వ‌ర‌రావు ఆత్మ‌హ‌త్య‌…!

ఏపీ  రాష్ట్రంలో విద్య‌ల‌న‌గ‌రంగా పేరొందిన విజ‌య‌న‌గ‌రం జిల్లా అందునా జిల్లా కేంద్రంలో  ఆ మ‌ధ్య  ఏఆర్  ఇన్ స్పెక్ట‌ర్ ఈశ్వ‌ర‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకుని.. దాదాపు నెలల రోజుల వ్య‌వ‌ధిలోనే అదే విభాగంలో కానిస్టేబుల్ గాప‌ని చేస్తున్న భాష త‌నువు చాలించాడు. 

విజ‌య‌న‌గ‌రం ఆర్మ్డ్ రిజ‌ర్వ్   ఇన్ స్పెక్ట‌ర్ గా ప‌ని చేసిన  ఈశ్వ‌ర‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ఘ‌ట‌న మ‌రువ‌క ముందే…మ‌రో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌టన విజ‌య‌న‌గ‌రంలోచోటు చేసుకుంది. ఏఆర్ విభాగంలో స్పెష‌ల్ టాస్క్ పోర్  విభాగంలో కానిస్టేబుల్ గా ప‌ని చేస్తున్న భాష….న‌గ‌రంలోని కోర్టువ‌ద్ద గోక‌పేట చెరువులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

స‌మాచారం తెలుసుకున్న పోలీసులతో పాటు స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది… చెరువులో  ప‌డ్డ  భాష మృత‌దేహాన్ని లైఫ్ జాకె్ట్టు వేసుకుని మరీ మ‌ద్య‌లో ఉన్న డెడ్ బాడీని బ‌య‌ట‌కు తీసారు.కాగా ఎస్టీఎప్  కానిస్టేబుల్ భాష‌కు .2018 లో పెళ్లై మూడేళ్ల పాప ఉంది.

కాగా…దాదాపు 20 ల‌క్ష‌ల‌కు వ‌ర‌కు అప్పులు చేసాడ‌ని..ఆ అప్పులు తీర్చ‌లేక పోవ‌డం…డ్యూటీల‌కనీ కొండ‌ల్లోకి వెళ్ల‌డంతో…భార్య ఇటీవ‌లే పుట్టింటికి వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం. విషయం తెలుసుకున్న వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ..కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.కాగా ఏఆర్ ఇన్ స్పెక్ట‌ర్ ఈశ్వ‌ర‌రావు… కూడా విధుల‌కై ఇంటి ప‌ట్టున ఉండ‌కుండానే నిర్వ‌హించేవాడు.

దీంతో ఇంటిప‌రంగా బాధ్య‌తలు లేకుండా..శాఖే త‌న భ‌ర్త‌ను ఇంట్లోఉండ‌నివ్వ‌కుండా చేసింద‌ని  ఈశ్వ‌రరావు భార్య ఆరోపించింది కూడ. అయితే…ఇన్ స్పెక్ట‌ర్ ఈశ్వ‌ర‌రావు…షేర్లకు డ‌బ్బులు పెట్ట‌డం…అది కాస్త ఇంట్లో గొడ‌వ‌క దారి తీయ‌డంతో మ‌నస్తాపానికిగురై మృతి చెందార‌ని పోలీసులు చెబుతున్నారు.

ఇక తాజాగా  ఆత్మ‌హ‌త్య చేసుకున్న స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్  కానిస్టేబుల్ భాష విష‌యంలోకూడా…కుటుంబ స‌మ‌స్య‌ల‌తో పాటు దాదాపు 20 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్పు చేసిన‌ట్టు స‌మాచారం. కాగా  .భాష తండ్రి కూడా…ఏఆర్ లో ప‌నిచేసి ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ చెందారు. ఇటువంటి స‌మ‌యంలో  విష‌యంతోనే ఇంట్లో గొడ‌వలు జ‌ర‌గిన‌ట్టు..మ‌న‌స్తాపంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు సమాచారం.ఏదైనా నిన్న ఏఆర్ ఇన్ స్పెక్ట‌ర్,తాజాగా ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ మృతి  పోలీసు శాఖ తో పాటు  ఆయా కుటుంబాల‌కు తీర‌ని విషాద‌మే.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

మార్పు కోసం కొల్లాపూర్ ప్రజల తిరుగుబాటు చేసి నేటికి రెండేళ్లు

Satyam NEWS

పేదలకు నిత్యావసర సరుకులు పంచిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS

ఉల్లి రైతుకు పొంచి ఉన్న ప్రమాదం

Satyam NEWS

Leave a Comment