30.2 C
Hyderabad
September 14, 2024 17: 21 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కువైట్ లో చిక్కుకున్న ఆంధ్రా యువకుడి ఆర్తనాదం

y s basanth

తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారి గురించి ఎన్నో గాధలు విన్నాం. అలాంటి విషాద గాధే ఈ యువకుడిది కూడా. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంక గ్రామానికి చెందిన ఈ యువకుడు 2008లో పొట్టకూటికోసం కువైట్ వెళ్లాడు. అక్కడ తన సాటివారు చేసిన పని కారణంగా పోలీసు కేసులో చిక్కుకున్నాడు. దాంతో పోలీసులు అతడి పాస్ పోర్టును తీసేసుకున్నారు. తిరిగి భారత్ రావడానికి వీల్లేకుండా చేశారు. అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి కూడా దీనివల్ల వీలుకావడం లేదు. దాంతో కువైట్ లో చిక్కుకుపోయి అక్కడ ఉండలేక, తిరిగి రాలేక పదేళ్లుగా అతడు నరకయాతన పడుతున్నాడు. కువైట్ లోని భారత ఎంబయిసీకి వెళ్లినా అతడికి ఎలాంటి సహాయం లభించలేదు. దాంతో తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డికి చేరే విధంగా సోషల్ మీడియాలో అతడు ఒక విడియోను పోస్టు చేశాడు. చివరకు ఈ వీడియో బసంత్ రెడ్డికి నేడు చేరింది. వీడియో చూసి చలించిపోయిన బసంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పటికే ఎంతో మంది తెలంగాణ బిడ్డలను గల్ఫ్ దేశాల నుంచి విజయవంతంగా స్వదేశానికి రప్పించిన బసంత్ రెడ్డి ఈ యువకుడి కేసును కూడా స్వీకరించి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇలాంటి ఎందరో యువకులు గల్ఫ్ దేశాలలో చిక్కకుపోతున్నారని, తిరిగి భార్యాబిడ్డలను చూసుకునేందుకు కూడా రాలేకపోతున్నారని బసంత్ రెడ్డి సత్యం న్యూస్ తో తన ఆవేదన పంచుకున్నారు. స్వతహాగా గల్ఫ్ దేశాలలో పని చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డ బసంత్ రెడ్డి విజయవంతంగా తిరిగి వచ్చి తనలా గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్నవారికి చాలా కాలంగా సేవలు అందిస్తున్నారు. అదే విధంగా ఈ యువకుడిని కూడా తిరిగి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని బసంత్ రెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఈ సమాచారం పంపి ఆ యువకుడిని విడిపించి భారత్ కు తిరిగి తెప్పించేలా సాయం చేయాలని బసంత్ రెడ్డి కోరుతున్నారు. ఆయన తన స్నేహితులకు సమాచారం పంపి ఆ యువకుడికి కాపాడే ప్రయత్నాలను ఇప్పటికే చేస్తున్నారు. మానవతా దృక్పదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తే ఆ యువకుడి సమస్య తీరుతుందని బసంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు

Related posts

మహోన్నతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Satyam NEWS

న్యూ స్కీమ్: జగనన్న విద్యా వసతి కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

కేటీకే ఆరో గనిలో ప్రమాదం… ఇద్దరు కార్మికులు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment