29.2 C
Hyderabad
October 10, 2024 19: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ఏపి ప్రధాన న్యాయమూర్తి తొలి తడబాటు

Justice Maheswari

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం లో ఘోరమైన తప్పిదం జరిగింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్‌ రిజిస్ట్రార్‌ పురుషోత్తం, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి అని చదివారు. గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అని చెప్పినా కూడా ఆయన ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్ న్యాయమూర్తిగా పని చేసిన నందునేమో తడబడి మధ్య ప్రదేశ్ చీఫ్ జస్టిస్ అని చదివేశారు. ఇది ఎవరూ గమనించలేదు. ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత జరిగిన పొరబాటును గమనించారు. మళ్లీ ఆయన ప్రమాణ స్వీకార పత్రం చదవాల్సి వచ్చింది. ఇది అసాధారణ పొరబాటు

Related posts

విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌

Satyam NEWS

తిరుమలలో రేపు శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు

Satyam NEWS

Leave a Comment