వరంగల్ గ్రామీణ నర్సంపేట ఆర్టీసి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ యాకూబ్ పాష గుండెపోటుకు గురై వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జఫర్ ఘడ్ మండల కేంద్రానికి చెందిన యాకూబ్ పాష నర్సంపేట డిపోలో పని చేస్తూ చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి లో నివాసముంటున్నాడు. సమ్మె నేపద్యంలో ఉద్యోగం ఉంటుందో లేదో అని మధనపడుతూ గుండెపోటుకు గురయ్యాడని ఆయనను చికిత్స కోసం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని తోటి కార్మికులు తెలిపారు.
previous post