40.2 C
Hyderabad
April 29, 2024 16: 54 PM
Slider నల్గొండ

తెలంగాణ నీటిని తీసుకెళ్లడం జగన్ దుర్మార్గం

#Gutta Sukhendar Reddy

పోతిరెడ్డి పాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోవలని  ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ లోని క్యాంపు కార్యాలయం లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 800 అడుగుల లోతునుండి సాగర్ నుండి నీటి ని పోతిరెడ్డి పాడు కి తరలిస్తే సాగర్  ఎడారిగా  మారే ప్రమాదం ఉందన్నారు.

గతంలో ముఖ్యమంత్రి వైయస్ ఆర్ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తూ నీటిని తీసుకుపోతే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా 800 అడుగుల లోతునుండి వాటర్ తీసుకుపోవలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నరని ఆయన చెప్పారు.

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకొని పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా నీటిని తీసుకుపోవాలి అనే ఆలోచనను విరమించుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ మన ప్రాజెక్టులకు అన్యాయం జరిగితే సహించరని సుఖేందర్ రెడ్డి తెలిపారు.

Related posts

మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దు

Satyam NEWS

బీఆర్ఎస్ వి మధ్యయుగపు కాలంనాటి ఆలోచనలు

Bhavani

మహిళా పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేసిన సచివాలయాలు

Satyam NEWS

Leave a Comment