38.2 C
Hyderabad
April 27, 2024 16: 53 PM
Slider తెలంగాణ

కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం

#Someshkumar IAS

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు ముఖ్యంగా కంటైన్ మెంట్ జోన్ లలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు.

గురువారం క్యాబినేట్ కార్యదర్శి  రాజీవ్ గౌబా కోవిడ్ -19 కు సంబంధించి ప్రజారోగ్య స్పందనపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో వైరస్ నియంత్రణలో ఉందని, రాష్ట్రానికి సరిపడ PPE Kits, N-95 Masks, Testing Kits, Beds, వెంటిలేటర్లు సమకూర్చుకున్నామని తెలిపారు.

ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, 1 లక్ష కేసులకు చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉన్నామని సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, CCLA Director రజత్ కుమార్ షైనీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వై ఎస్ షర్మిల గారూ ఆంధ్రా బిడ్డగా ఒక సారి మమ్మల్ని చూడండి

Satyam NEWS

అప్పీలుకు వెళ్తున్నాను అప్పుడే శిక్ష ప్రకటించవద్దు

Satyam NEWS

సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిలో సోదాలు

Satyam NEWS

Leave a Comment