28.7 C
Hyderabad
April 27, 2024 04: 23 AM
Slider తెలంగాణ

నిధులను సక్రమంగా వినియోగించుకోవాలి

pocharam

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో రూ. 2.10 కోట్లతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదులకు, ఆడిటోరియంకు శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి

 శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు ఎలా ఉంటాయో విద్యాలయాలు కూడా అలానే ఉండాలి. గుడి కట్టడానికి చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో బడి కట్టడానికి అంతే అవసరం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో 1.70 లక్షల మంది ఉపాద్యాయులుగా ఉన్నారు. ష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ శాఖ తర్వాత విద్యాశాఖకే అత్యధిక నిధులు కేటాయిస్తుంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చెసే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు. ప్రవేటు, కార్పొరేట్ విద్యాలయాల విద్యార్థులే కాదు ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, ఉద్యోగాలు సాధిచాలని ఆయన ఆకాంక్షించారు.

Related posts

మీల్ ఫర్ పూర్:మహారాష్ట్రలో రూ.10కే ‘శివ భోజన్‌’

Satyam NEWS

సెలవు దినాలలో వ్యవసాయ రైతు కూలీగా తస్లీమా

Satyam NEWS

రుక్మిణి,సత్యభామ,సీతా,రామ,లక్ష్మణులకు రజితాభరణాల బహుకరణ

Satyam NEWS

Leave a Comment